నిఖితా పవర్, విశ్వ
శివగణేశ్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివి రెడ్డి, నాగేంద్ర వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా బయోపిక్’. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. విశ్వ కథానాయకునిగా పరిచయం అవుతున్నారు. నిఖితా పవర్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్‌ఎస్ నాయకులు మెట్ట సూర్యప్రకాశ్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు జీవా క్లాప్ ఇచ్చారు. అనంతరం శివగణేశ్ మాట్లాడుతూ – ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. దర్శకునిగా ఇది నా మూడో చిత్రం.
గతంలో నేను ‘33 ప్రేమ కథలు’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాను.నా రెండో చిత్రం ‘సకల కళా వల్లభుడు’ రిలీజుకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. విశ్వ మాట్లాడుతూ – ‘‘హీరోగా నాకిది మొదటి సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. రవిచంద్ర ఈమండి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు శివగణేశ్ కథ చెబుతున్నంత సేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఫీలయ్యాను. జూలై 26న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు అజయ్ పట్నాయక్, నటుడు జబర్దస్త్ మురళీ, హీరోయిన్ నిఖితా పవర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment