Mahesh Babu 28th Movie With Trivikram Srinivas, Pooja Ceremony Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu-Trivikram Movie: మహేశ్​-త్రివిక్రమ్​ కాంబో రిపీట్​.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

Published Thu, Feb 3 2022 11:10 AM | Last Updated on Thu, Feb 3 2022 1:46 PM

Mahesh Babu Trivikram Srinivas Combo Movie Has Been Started - Sakshi

Mahesh Babu Trivikram Srinivas Combo Movie Has Been Started: మహేశ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు' ఎంతపెద్ద హిట్​ సొంతం చేసుకుందో తెలిసిందే. తర్వాత వచ్చిన 'ఖలేజా' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్​లో ముచ్చటగా మూడోసారి మూవీ రానుందంటే ఆడియెన్స్​లో కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్​గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి తప్ప సెట్స్​పైకి వెళ్లింది మాత్రం లేదు. 

అయితే ఎట్టకేలకు మహేశ్​ బాబు-త్రివిక్రమ్​ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు గురువారం (ఫిబ్రవరి 3) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ పూజాకార్యక్రమాలకు మహేశ్​ బాబు హాజరు కాలేదు. మహేశ్​ భార్య నమ్రత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా హారికా అండ్​ క్రియేషన్స్​లో వస్తున్న ఏడో మూవీ కాగా హీరోగా మహేశ్​ బాబుకు 28వ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా అతడుకు సీక్వెల్​గా పుకార్లు వినిపిస్తున్నాయి. 2005లో బ్లాక్​ బస్టర్​ హిట్​గా నిలిచిన ఈ 'అతడు' సినిమాకు కొనసాగింపుగా తీయాలని తివిక్రమ్​ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి 'పార్థు' అని టైటిల్​ పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో నిజమెంతుందో వేచి చూడాలి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement