కొత్త లవ్‌జర్నీని మొదలెట్టాడు కుర్ర హీరో అఖిల్. కానీ ఇక్కడ కాదు. ఫారిన్‌లో. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బీవీఎస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ గురువారం యూకేలో మొదలైంది. ‘‘అఖిల్ థర్డ్ సినిమా మొదలైంది. జార్జ్ సి. విలియమ్స్ కెమెరామేన్‌గా చేస్తున్నారు.
మా బ్యానర్‌లో ఇది 25వ సినిమా’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ‘‘కొత్త టీమ్‌తో పనిచేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్’’ అన్నారు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. మేజర్ షూటింగ్ ఫారిన్‌లోనే జరుగుతుంది. ఆ నెక్ట్స్ హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌తో చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment