మేము రెడీ.. | Akhil's new movie title will be confirmed on a special day | Sakshi
Sakshi News home page

మేము రెడీ..

Published Mon, Sep 17 2018 3:27 AM | Last Updated on Mon, Sep 17 2018 3:27 AM

Akhil's new movie title will be confirmed on a special day - Sakshi

అఖిల్

... మీరు రెడీనా? అని అడుగుతున్నారు హీరో అఖిల్‌. ఎందుకంటే ఫస్ట్‌ లుక్‌ను చూడటానికి. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్‌ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఈ నెల 19న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

అఖిల్‌ తాతగారు అక్కినేని నాగేశ్వరరావు బర్త్‌డే (సెప్టెంబర్‌ 20) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తున్నారట. ఈ సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ లండన్‌లో పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. అఖిల్, నిధిలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement