BVSN Prasad
-
‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్) అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేసి, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలో ట్రైలర్: ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది. -
మంచి కథతో పెదకాపు రూపొందింది
‘‘పెదకాపు 1’ ట్రైలర్ చాలా బాగుంది. రవీందర్ రెడ్డిగారు తన బావమరిదిని, పైగా కొత్త హీరోని పెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ విడుదల చేయగా, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ– ‘‘పెదకాపు’ మా యూనిట్‌కి మరపురాని చిత్రంగా నిలిచి, ‘పెదకాపు 2’కి ప్రస్థానం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సినిమా మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను’’ అన్నారు మిర్యాల రవీందర్ రెడ్డి. ‘‘నాకింత మంచి కథ ఇచ్చిన శ్రీకాంత్, నిర్మించిన రవీందర్ రెడ్డిగార్లకు రుణపడి ఉంటా’’ అన్నారు విరాట్ కర్ణ. కెమెరామేన్ ఛోటా కె. నాయుడు పాల్గొన్నారు. -
మరో థ్రిల్లర్‌తో...
‘విరూపాక్ష’ సినిమాతో ఘనవిజయం అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ‘విరూపాక్ష’ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రీ లుక్ ΄ోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘విరూపాక్ష’ను మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందించిన కార్తీక్ దండు తన తదుపరి చిత్రాన్ని మిథికల్ థ్రిల్లర్ జానర్లో తీయబోతున్నాడు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సరికొత్త అనుభూతినిస్తుంది
‘‘తరుణ్ తేజతో కలిసి మా అబ్బాయి బాపినీడు హారర్ జోనర్లో ‘అశ్విన్స్’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం విజువల్స్, సౌండింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వసంత్ రవి హీరోగా, విమలా రామన్ కీ రోల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వంలో బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తరుణ్ తేజ మాట్లాడుతూ– ‘‘అశ్విన్స్’ కాన్సెప్ట్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. అది చూసిన బాపినీడుగారు అదే కాన్సెప్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌లా చేద్దామన్నారు. ప్రసాద్‌గారు, బాపినీడుగారి సహకారంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘అశ్విన్స్’ తరుణ్ కల.. దాన్ని నెరవేర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విమలా రామన్. ‘‘తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అశ్విన్స్’ వంటి మంచి చిత్రంతో రావటం హ్యాపీగా ఉంది’’ అన్నారు వసంత్ రవి. -
ఇంటర్నేషనల్ గూఢచారిగా వరుణ్ తేజ్.. యాక్షన్ బిగిన్
గన్ను ఫుల్‌గా లోడ్ చేసి రంగంలోకి దిగారు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. హీరో వరుణ్ తేజ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘షూటింగ్ మొదలైంది. ది గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ బిగిన్స్’ అంటూ లొకేషన్ వీడియోను షేర్ చేశారు వరుణ్ తేజ్. కాగా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. -
ఫీమేల్ క్యారెక్టర్ చేయాలని ఉంది
‘‘సెట్స్‌లో నాదైన శైలిలో నటించాలనుకుంటాను. అందుకే దర్శకుల నుంచి పెద్దగా రిఫరెన్సెస్ కూడా అడగను. దర్శకులు చెప్పిన కథ, అందులోని సందర్భాల ప్రకారం నటించడమే నాకు ఇష్టం’’ అని దర్శక–నటుడు విశ్వక్ సేన్ అన్నారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్రం రేపు థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ చెప్పిన విశేషాలు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నా కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. ఈ సినిమాకు మ్యాజిక్ జరిగింది. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. నిజానికి ఈ కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనుకున్నాను. కథ వినడమే ఈ టైటిల్‌తోనే విన్నాను. సో.. వేరే టైటిల్స్ అనుకోలేదు. సినిమాలో తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అనేవి ఒక లేయర్ మాత్రమే. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. సందేశం కూడా ఉంది. ముఖ్యంగా అనవసరంగా పోలికలు పెట్టుకుని ఆత్మన్యూనతా భావంతో బాధపడే అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ‘మీ(మహిళలను ఉద్దేశిస్తూ...) గురించి మీరే నిలబడాలి’ అనే డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ లోపే పెళ్లి చేసుకుంటాను! ఈ సినిమాలో అల్లం అర్జున్‌కుమార్ పాత్రలో కనిపిస్తాను. నా తొలి సినిమా ‘వెళ్లిపోమాకే’కు చేసిన వర్క్‌షాప్స్ కూడా ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి. 30 ఏళ్ల వయసు మీద పడిన పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ క్యారెక్టర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ‘మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు అలాంటి ఎంటర్టైన్మెంట్ను మా సినిమా అందిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం బరువు పెరిగాను. నిజానికి బరువు తగ్గడం సులభమే కానీ పెరగడం కష్టం. ఇక పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం ఉంది. నాకు 30 ఏళ్లు దాటే లోపే పెళ్లి చేసుకుంటాను. ఇక యాక్టర్‌గా నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కమల్‌హాసన్‌గారు ‘భామనే సత్యభామనే’ సినిమాలో చేసిన ఫీమేల్ క్యారెక్టర్ లాంటివి చేయడానికి సిద్ధమే. అలాగే నేను తెలంగాణ హీరోగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తాను. పాన్ ఇండియా స్థాయిలో... తమిళ సినిమా ‘ఓ మై కడవులే..’ చిత్రానికి తెలుగు రీమేక్ ‘ఓరి... దేవుడా’ సినిమా చేశాను. ‘దమ్కీ’ సినిమా చేస్తున్నా. అయితే ‘దమ్కీ’ సినిమా కథపై దర్శకుడు నరేష్ కన్నా నాకే ఎక్కువ కమాండ్ ఉందనిపించి ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. నరేశ్‌తో భవిష్యత్‌లో మరో సినిమా ఉండొచ్చు. హిందీలో ఓ సినిమా చేసే ప్రయత్నాలను మొదలుపె ట్టాను. ‘సవారి’ ఫేమ్ సాహితి దర్శకత్వంలో ‘స్టూడెంట్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. -
ఆమె ఏ భాషకైనా సరిపోతారు: విజయ్ దేవరకొండ
‘‘ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ భాషలో చేసినా ఆ భాషకి సరిపోతారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘భామా కలాపం’ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రియమణి నటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రదర్శకుడు భరత్ కమ్మ ఈ షోకి రన్నర్. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి∙‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ‘భామా కలాపం’ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను ఆదరించారు.. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్ తీసిన ఈ వెబ్ సిరీస్‌ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘భామా కలాపం’లో అనుపమ అనే చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ప్రియమణి. ‘‘మేము అనుకున్న దాని కంటే అభిమన్యు బాగా డైరెక్ట్ చేశాడు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఏడాది క్రితం సరదాగా రాసుకున్న కథ ఇక్కడివరకు రావడం హ్యాపీ’’ అన్నారు అభిమన్యు తాడిమేటి. -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ చూశారా?
Vaisshnav Tej and Ketika Sharma First Look Released: వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం∙టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మెగా మేనల్లుడికి హీరోయిన్ బటర్ ఫ్లై కిస్!
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలకు సంతకం చేశాడు. ఈ క్రమంలో వచ్చిన 'కొండపొలం' పెద్దగా విజయం సాధించలేకపోయింది. తాజాగా తన మూడో సినిమాను అధికారికంగా ప్రకటించాడు వైష్ణవ్. గిరీశాయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్‌కు ఫిక్స్ చేశారు. ఈ మేరకు సోమవారం(జనవరి 24) టైటిల్ టీజర్‌ను కూడా వదిలారు. ఇందులో యంగ్ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ట్ లెవల్లో ఉందన్న హీరో డైలాగ్‌తో టీజర్ పూర్తైంది. ఇది మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అని, ఇది కూడా ఉప్పెనంత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
కొత్త డైరెక్టర్‌తో వైష్ణవ్ సినిమా: రోల్ ఏంటంటే?
హీరో వైష్ణవ్ తేజ్ హాకీ స్టిక్ పట్టుకుని బరిలో దిగనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారట. ఇదంతా వైష్ణవ్ హీరోగా నటించనున్న తర్వాతి చిత్రం కోసమే అనే సంగతి అర్థమై ఉంటుంది. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఘన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేయనున్నారాయన. నాగార్జున నిర్మించే చిత్రం క్రీడల నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. పృథ్వీ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందనుందట. ఇందులో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ పాత్ర చేయనున్నారని టాక్. అసలు సిసలైన హాకీ ప్లేయర్‌గా ఒదిగిపోవడానికి వైష్ణవ్ కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ వార్త. -
ఆశోకవనంలో ‘కల్యాణం’ చేసుకోబోతున్న విశ్వక్ సేన్
‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’ చిత్రాల ఫేమ్ విశ్వక్సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా షురూ అయింది. విద్యాసాగర్ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు.బి, సుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విష్వక్ సేన్ తల్లి దుర్గ క్లాప్ కొట్టారు. బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ –‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో, సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. వినోదం సహా అన్ని అంశాలున్న ఎంటర్టైనర్ ఇది. విష్వక్ నటించిన, నటిస్తోన్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా’’ అన్నారు. -
సుకుమార్ స్క్రీన్‌ప్లేతో..
సాయితేజ్ కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎ¯Œ ప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. సుకుమార్ వద్ద రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని రాయడంతోపాటు షట్‌చక్రంలో ఓ కన్నుని ఈ పోస్టర్లో పొందుపరిచారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. -
సరికొత్త యాక్షన్
యాక్షన్ చిత్రాలవైపు ఎక్కువగా ఆసక్తి చూపించే గోపీచంద్ తాజాగా మరో యాక్షన్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్–బీవీఎస్ఎన్ ప్రసాద్‌ల కాంబినేషన్లో గతంలో ‘సాహసం’ (2013) అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కొత్త సినిమాతో బిను సుబ్రమణ్యం దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘‘గోపీచంద్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్న చిత్రం ఇది. యాక్షన్ అడ్వంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సతీశ్ కురుప్ కెమెరామన్‌గా వ్యవహరిస్తున ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీహెచ్ నరసింహాచారి. -
అంతకు మించి...
గోపీచంద్ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ‘సాహసం’ చిత్రం ఘనవిజయం సాధించింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ఇప్పుడు మరోసారి గోపీచంద్–బీవీఎస్.ఎన్. ప్రసాద్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ఓ సినిమా ఆరంభమైంది. సంతోష్ శివన్, ‘జయం’ రాజాల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బీవీఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సాహసం’ తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బిను సుబ్రమణ్యం చెప్పిన కథ చాలా బాగుంది. ‘సాహసం’ చిత్రం ట్రెజర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో.. ఈ సినిమా దాన్ని మించి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. రాజీపడకుండా ఈ చిత్రం నిర్మిస్తాం. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సతీష్.కె ఛాయాగ్రాహకుడు. -
మేము రెడీ..
... మీరు రెడీనా? అని అడుగుతున్నారు హీరో అఖిల్. ఎందుకంటే ఫస్ట్ లుక్‌ను చూడటానికి. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అఖిల్ తాతగారు అక్కినేని నాగేశ్వరరావు బర్త్‌డే (సెప్టెంబర్ 20) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నారట. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ లండన్‌లో పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. అఖిల్, నిధిలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
లండన్‌లో ల్యాండ్ అయ్యానోచ్!
సిల్వర్ స్క్రీన్‌పై విద్యుల్లేఖా రామన్ ఉంటే చాలు. కామెడీకి కొదవ ఉండదు ఆడియన్స్‌కు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన ‘తొలిప్రేమ’ సినిమాలో ఆమె చేసిన రోల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మళ్లీ వెంకీ అట్లూరి సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అఖిల్ హీరోగా వెంకీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ యూకేలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికి లండన్‌లో ల్యాండ్ అయ్యారు విద్యుల్లేఖా రామన్. ‘‘అఖిల్ థర్డ్ మూవీలో ఎగై్జటింగ్ క్యారెక్టర్ చేయడానికి లండన్ వచ్చాను. లెట్స్ రాక్ అఖిల్’’ అని పేర్కొన్నారామె. ఈ సినిమాలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్ చేయనున్నారట. చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మొదలైన అఖిల్ మూడో సినిమా!
‘అఖిల్’ సినిమాతో అక్కినేని అఖిల్‌కు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ‘హలో’ సినిమా చేశాడు. ఈ సినిమా విజయవంతమైనా.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మొదటి చాన్స్‌లోనే ‘తొలిప్రేమ’ లాంటి సినిమాను తీసి డైరెక్టర్‌గా తన టాలెంట్ చూపారు వెంకీ అట్లూరి. తన రెండో చిత్రంగా అఖిల్‌తో ఓ సినిమాను చేయబోతోన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీరి కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు (జూన్ 21) ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాను ఎస్వీసీసీ క్రియేషన్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా, తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించనుంది. #Akhil3 starts rolling today. Directed by @dirvenky_atluri. A @MusicThaman musical.@George_DOP handles the camera.@AkhilAkkineni8 #SVCC25 pic.twitter.com/F60LN1IAwY — SVCC (@SVCCofficial) June 21, 2018 -
అక్టోబర్‌లో వస్తున్నాడు
రెండు నెలలకు సరిపడా వస్తువులన్నింటినీ సూట్‌కేసులో సర్దుకుంటున్నారు అఖిల్ అండ్ టీమ్. ఎందుకంటే.. నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ యూకేలో జరగనుంది. ‘‘సినిమా చాలా బాగా వస్తోంది. నెక్ట్స్ రెండు నెలల ఈ సినిమా షెడ్యూల్‌ను యూకేలో ప్లాన్ చేశాం. ఆ షెడ్యూల్‌తో దాదాపు 70 పర్సెంట్ సినిమా కంప్లీట్ అవుతుంది. యూకే నుంచి వచ్చిన తర్వాత మరో నెల రోజులు షూట్ జరిపితే సినిమా కంప్లీట్ అవుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటు న్నారు. -
నాగ్ క్లాప్.. సల్మాన్ కెమెరా ఆన్
సాక్షి, హైదరాబాద్ : అక్కినేని అఖిల్ మూడో చిత్రం అధికారికంగా లాంఛ్ అయ్యింది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుందని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో, అఖిల్ తండ్రి నాగార్జున అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. థమన్ మ్యూజిక్ అందించబోతున్న ఈ చిత్రానికి జార్జ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర(ఎస్వీఎస్సీ) బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
కన్ఫ్యూజన్ వద్దని..
వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవియస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తొలి ప్రేమ’. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ రెండు సినిమాలను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. దాంతో రెండు చిత్రాల నిర్మాతలు డిస్కస్ చేసుకొని ‘తొలిప్రేమ’ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా బీవియస్‌యన్ ప్రసాద్, ‘దిల్’ రాజు విలేకరులతో మాట్లాడారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కష్టపడి సినిమా చేశాక రెవెన్యూ తెచ్చుకోవడం ముఖ్యం. అందుకని ప్రసాద్‌గారు ‘తొలిప్రేమ’ సినిమాను 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు సినిమాలు వేగంగా చేస్తున్నారు. దాంతో ప్రతి శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకని క్లాష్ ఏర్పడుతోంది. నేను ‘తొలి ప్రేమ’ చూశాను. ప్రసాద్‌గారి బ్యానర్లో వచ్చిన ‘డార్లింగ్, అత్తారింటికి దారేది’లాగా మంచి సక్సెస్ సాధిస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌గా లాస్ట్ ఇయర్ ఫెయిలయ్యాను. ఈ ఇయర్ ‘భాగమతి’తో హిట్ సాధించాను. ‘తొలిప్రేమ’ కూడా సక్సెస్ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామనుకున్నాం. అదే రోజు ‘ఇంటిలిజెంట్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వరుణ్, ధరమ్‌తేజ్ ఫ్యాన్స్ మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడకూడదని ‘దిల్ ’ రాజుగారితో మాట్లాడి ఫిబ్రవరి 10న విడుదలను ప్లాన్ చేశాం’’ అని బీవియస్‌యన్ ప్రసాద్ అన్నారు. -
‘తొలిప్రేమ’ టీజర్ విడుదల
-
‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..!
ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ తొలిప్రేమ. బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణపనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. వరుణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈసినిమా టీజర్ ను బుధవారం రిలీజ్ చేశారు. తమన్నా స్వరాలందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..! -
కొత్త దర్శకుడితో మెగా ప్రిన్స్
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్, సక్సెస్ సాధించడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఫిదా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ సాధించిన వరుణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తొలి ప్రేమ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. తనకు ఫిదా లాంటి బిగ్ హిట్ ఇచ్చిన దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో షార్ట్ ఫిలిం దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శశి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. మరి రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడో చూడాలి. -
రాత్రిపూట రైల్వే స్టేషన్లో..!
అమ్మాయిని ఆటపట్టిస్తే అందంగా ఉంటుంది. అల్లరిపాలు చేయాలని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఓ రాత్రిపూట అందమైన అమ్మాయి కనిపించగానే కొందరు పోకిరీలు అల్లరిపాలు చేయాలని చూశారు. పక్కనే ఉన్న ఓ అబ్బాయి థియేటర్లో సినిమా చూస్తున్నట్టు... పోకిరీ పనులను చూస్తూ ఊరుకోలేదు. రెండు పీకడం మొదలెట్టాడు. అంత మంచి మనసున్నోడు ఎవరో కాదు... వరుణ్ తేజ్. ఆ అందమైన అమ్మాయి రాశీఖన్నా. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న సినిమాలో సన్నివేశమిది. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రైల్వే స్టేషన్లో రాత్రిపూట జరిగే సన్నివేశాలను, చిన్న ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారట. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రాశీ ఖన్నా, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘మరో అందమైన ప్రేమకథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నా. నా నెక్స్›్ట ఫిల్మ్ షూటింగ్ మొదలైంది’’ అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ‘ఫిదా’ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
అంత బరువు నేను లాగలేను
‘‘కొంతమంది నా సహనటులు నాతో అంటుంటారు. ఇన్నేళ్లుగా నటించారు. ఇక విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని. నాకు తెలిసి వయసు, సర్వీసు రిలాక్స్ కోరుకుంటాయేమో? కానీ, సినిమాలపై నాకున్న ప్యాషన్ నన్ను రిలాక్స్ కానివ్వదు’’ అన్నారు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్. ‘అల్లరి’ నరేశ్, కృతిక, మౌర్యాని, రాజేంద్రప్రసాద్ ముఖ్య తారలుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం... నాకేం భయం’. భోగవల్లి బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన విశేషాలు. ♦1977లో సినిమా రంగంలోకి వచ్చాను. మరో రెండు రోజులైతే నలభై సంవత్సరాలవుతుంది. ఇన్నేళ్లుగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారంటే కారణం రచయితలు, దర్శకులే. వారు నాకు మంచి పాత్రలు ఇవ్వబట్టే నటుడిగా నేనేంటో నిరూపించుకున్నా. అందుకే వారికి జీవితాంతం రుణపడి ఉంటా. ♦ ఇప్పటి తరం రచయితలు, దర్శకులు కూడా నా కోసం మంచి పాత్రలు సృష్టిస్తున్నారు. ‘లవ్లీ’తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారా. అప్పటి నుంచి కొరటాల శివ, త్రివిక్రమ్, సుకుమార్, అనిల్ రావిపూడిలతో పాటు యువ డైరెక్టర్లతోనూ చేస్తున్నా, ఇంకా చేస్తా. ♦ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. ఒక్కో టైమ్‌లో ఒక్కో తరహా చిత్రాల హవా నడుస్తుంది. ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ తరహా చిత్రంలో నేను నటించడం మొదటిసారి. ఈ చిత్రం చూసి ప్రేక్షకులు వంద శాతం రిలాక్స్ అయి, హ్యాపీగా ఇంటికి వెళతారు. ♦ ‘మా అల్లుడు వెరీగుడ్’ తర్వాత నేనూ, నరేశ్ కలసి చేశాం. తన నటనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. జి. నాగేశ్వరరెడ్డి అంతమంది ఆర్టిస్టులను చక్కగా హ్యాండిల్ చేశారు. పెద్ద పెద్ద చిత్రాలు తీసిన ప్రసాద్‌గారు ఈ సినిమాకి కూడా ఎక్కడా రాజీ పడలేదు. ♦ నటుడిగా సక్సెస్ అయిన నేను నిర్మాతగా అట్టర్ ఫ్లాప్. నేను నిర్మించిన ‘మేడమ్’, ‘రాంబంటు’ చిత్రాలు బాగా దెబ్బతీశాయి. రామానాయుడుగారు చాలాసార్లు నన్ను దర్శకత్వం చేయమన్నారు. ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు. డైరెక్టర్ జాబ్ అన్నది బాధ్యతతో కూడుకున్నది. అంత బరువు నేను లాగలేను. ఆ అర్హత వచ్చినప్పుడు చేస్తా. ♦ నన్ను నమ్మి ‘మా’ అధ్యక్షునిగా ఎన్నుకున్న వారి నమ్మకం వమ్ము చేయకుండా పనిచేస్తున్నా. ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిగారు ‘మా’ సేవల్ని అభినందించడంతో పాటు ఇంకా బాగా చేసేందుకు తనవంతు సాయం చేస్తాననడం హ్యాపీ. ఇకపై కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తా. -
కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్
మెగా వారసుడు వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న వరుణ్ ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగాను మరో సినిమాను ఫైనల్ చేశాడు. క్లాస్ మాస్ అనే ఇమేజ్‌లకు దూరంగా అన్ని రకాల సినిమాలు చేస్తున్న వరుణ్ త్వరలో కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఇటీవల కాలిగాయంతో చాలా కాలం పాటు ఇంటికే పరిమితమైన మెగా ప్రిన్స్ ఇప్పుడు త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే మిస్టర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అదే స్పీడు ఫిదా సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు వరుణ్. -
ఎప్పుడు రిలీజైనా హిట్టే!
‘‘నాకు ఈ ఏడాది వ్యక్తిగతంగా చాలా ఆనందాన్నీ, వృత్తిపరంగా కాస్త అసంతృప్తినీ అందించింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన హారర్–కామెడీ ‘ఇంట్లో దెయ్యం... నాకేం భయం’. నవంబర్ 13న రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా నోట్ల రద్దు ప్రభావంతో వాయిదా పడి, ఈ నెల 30న థియేటర్లలోకి వస్తోంది. ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు.. ♦ నోట్ల రద్దు దెబ్బకు ఆగిన ఫస్ట్ మూవీ మాదే. బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్న ప్రజలు థియేటర్లకు రావడం కష్టమనే ఉద్దేశంతో విడుదల వాయిదా వేశాం. ఎప్పుడు రిలీజైనా హిట్టయ్యే చిత్రమిది. ♦ పెళ్లికి బ్యాండ్ వాయించే కుర్రాడు అనుకోకుండా మంత్రగాడిగా మారితే ఏం జరిగిందనేది చిత్రకథ. ఇందులో దెయ్యం ఎప్పుడూ ఒకరిలో ప్రవేశించదు. నోటికి వచ్చిన మంత్రాలు చదువుతూ... కాసేపు భయపడుతూ, అప్పుడప్పుడూ భయపెడుతూ ప్రేక్షకుల్ని నవ్వించే పాత్ర చేశా. ♦ నిర్మాత ప్రసాద్‌గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. భారీ సినిమాలు తీసే ఆయన, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఎక్కువమందికి పని దొరుకుతుంది. అందరికీ ధైర్యం వస్తుంది. జి. నాగేశ్వరరెడ్డితో మూడో చిత్రమిది. ఎలాంటి సినిమా చేయాలని చాలారోజులు ఆలోచించి ఈ కథ ఓకే చేశాం. ♦ పెళ్లైన తర్వాత బాధ్యత తెలుస్తుంది అంటుంటారు. కానీ, నన్ను అడిగితే.. పిల్లలు పుట్టిన తర్వాతే బాధ్యతలు తెలుస్తాయి. ఈ ఏడాది పాప పుట్టిన తర్వాత లైఫ్‌లో సంతోషం ఎక్కువైంది. అలాగే, ప్రతి ఏడాదీ నాలుగైదు సినిమాలు చేసే నేను ఈ ఏడాది ‘సెల్ఫీ రాజా’, ఇప్పుడీ సినిమా చేశానంతే. అది కొంచెం అసంతృప్తిగా ఉంది. ♦ ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్‌కృష్ణ దర్శకత్వంలో నటించనున్న ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ రీమేక్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా, కొత్త దర్శకుడు సతీశ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాను. 2020 నాటి వేసవిలో ఒక ప్రేమకథా చిత్రంతో నేను దర్శకుడిగా పరిచయమవడా నికి సిద్ధమవుతున్నా. -
దర్శకుడికి కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. మాస్ ఇమేజ్ను ఎన్టీఆర్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించటంతో పాటు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాదు 52 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ హ్యాపి ఫీల్ అయిన నిర్మాత బివియస్ఎన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 52 లక్షల ఖరీదు చేసే బీయండబ్ల్యూ ఎక్స్3 సీరీస్ కారును సుకుమార్‌కు కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఈ అక్టోబర్‌లో చెర్రీ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతోంది. -
ఈ పోలీస్ చాలా స్టైల్ గురూ!
సినిమా సినిమాకి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్లో తన ‘ప్రస్థానం’ కొనసాగిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శర్వానంద్. తొలిసారి ఆయన వినోదభరితమైన పోలీస్‌గా నటిస్తున్నారు. దర్శకుడు కరుణాకరన్ వద్ద పనిచేసిన చంద్రమోహన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయి. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పటివరకూ చూడని శర్వానంద్‌ను ఈ చిత్రంలో చూస్తారు. చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. మొదటి షెడ్యూల్ చాలా బాగా వచ్చింది. ఈ నెల 15 నుంచి రెండో షెడ్యూల్ జరపనున్నాం. రధన్ పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. కార్తీక్ ఘట్టమనేని కెమేరా పనితనం చాలా రిచ్‌గా ఉంటుంది. టైటిల్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఫుల్ హ్యాపీ!
‘‘ఇందులో కొత్త ఎన్టీఆర్‌ని చూశామనీ, కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇచ్చారనీ అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది’’ అని నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆయన నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు వారాల్లో 50 కోట్ల షేర్ని క్రాస్ చేయడం ఆనందంగా ఉందని బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు. మరికొన్ని విశేషాలను శనివారం పాత్రికేయులతో ఈ విధంగా పంచుకున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి డివెడైడ్ టాక్ వచ్చింది. కానీ, ఎన్నో సినిమాలు తీసిన నిర్మాతగా సినిమా ఎప్పుడు నిలబడుతుందనే విషయం మీద నాకు అవగాహన ఉంది. అందుకని కంగారుపడలేదు. నా నమ్మకం నిజమైంది. డివెడైడ్ టాక్ వచ్చినప్పటికీ చూసినవాళ్లందరూ బాగుందనడంతో సినిమా నిలదొక్కుకుంది. ఎన్టీఆర్ నటన బాగుందని అందరూ అంటున్నారు. మంచి సినిమా తీశాడని సుకుమార్‌ని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రేమించారు కాబట్టే, మంచి వసూళ్లు దక్కాయి. ♦ సినిమా చూసినవాళ్లలో కొంతమంది హైదరాబాద్‌లో కూడా తీయొచ్చ న్నారు. కానీ, కథానుగుణంగానే లండన్‌లో తీశాం. కథకు తగ్గ లొకేషన్ అనీ, అక్కడ తీయడం వల్లే కథ ఎలివేట్ అయ్యిందనీ చాలామంది అన్నారు. సినిమా మొత్తం చాలా గ్రాండ్‌గా ఉందని కూడా ప్రశంసించారు. ♦ చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. బాగా ఆడే ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఈ మధ్య నేను ‘దోచెయ్’ అనే మీడియమ్ బడ్జెట్ సినిమా తీశాను. అది పెద్దగా ఆడలేదు. ఏ సినిమాకైనా దర్శకుడు, హీరో కాంబినేషనే ముఖ్యం. ఆ కాంబినేషన్‌కి బలమైన కథ కుదిరితే సినిమా నిర్మాణం మొదలవుతుంది. సో... కథ కన్నా కూడా ముందు కాంబినేషన్ సెట్ అవ్వాలి. ♦ అందరు హీరోలూ నాతో చాలా బాగుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్. మా సంస్థలో ఏ సినిమా తీసినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం. అందుకే అనుకున్న సమయానికి విడుదల చేస్తాం. ప్లానింగ్ విషయంలో మా అబ్బాయి బాపినీడుని అభినందించాల్సిందే. నిర్మాతగా నాది 30 ఏళ్ల ప్రయాణం. 1986 సంక్రాంతికి ‘డ్రైవర్ బాబు’ రిలీజైతే, ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ వచ్చింది. ఈ థర్టీ ఇయర్స్ అయామ్ వెరీ హ్యాపీ. ♦ ‘అత్తారింటికి దారేది’ పారితోషికం విషయంలో నాకూ, పవన్ కల్యాణ్‌కూ మధ్య వచ్చింది చిన్న సమస్య. త్వరలోనే అది పరిష్కారం అవుతుంది. కుదిరితే నెక్ట్స్ సినిమా కూడా పవన్‌కల్యాణ్‌తో చేయొ చ్చేమో. ప్రస్తుతం ముగ్గురు హీరో లతో సంప్రతింపులు జరుపుతున్నా. ఎవరితో చేస్తానో త్వరలో చెబుతా. -
దొరికింది దోచే సేయ్..!
జీవితంలో మోసం చేసి పైకి రావడం చాలా ఈజీ. కొంత మంది స్వార్ధంతో మోసం చే స్తే మరి కొంత మంది మోసంలో మంచి కూడా ఉంటుంది. మరి ఈ కథలో హీరో కూడా దొరికింది దోచేస్తాడు...కానీ ఒక కారణం ఉంది.... మరి అదేంటో తెలియాలంటే ‘దోచేయ్’ చూడాల్సిందే. నాగచైతన్య, కృతీసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘అభిమానుల అంచనాలను అందుకునేలా సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్ ఈదర. -
ఎనర్జీ లెవెల్స్‌కి తగ్గట్టుగా...
ఎనర్జీకి మరోరూపం ఎన్టీఆర్. నవరసాలనూ అలవోకగా పలికించే సత్తా ఉన్న నటుడు ఆయన. ఇక నాట్యం గురించి సరేసరి. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి, నటునిగా తనేంటో నిరూపించుకున్నారు ఎన్టీఆర్. అయితే... ప్రస్తుతం మాత్రం ఆయన స్థాయికి తగ్గ కథలు దొరకడం లేదనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేసే బాధ్యతను దర్శకుడు సుకుమార్ తీసుకున్నారు. ఎన్టీఆర్లోని ఎనర్జీ లెవల్స్‌ని అద్భుతంగా ఆవిష్కరించే శక్తిమంతమైన కథను ఆయన సిద్ధం చేశారట. బీవీఎస్ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్‌కిది డిఫరెంట్ మూవీ అవుతుంది. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్సూ ఉన్న కథ ఇది. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు. ‘‘ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఇదే ప్రథమం. ఎన్టీఆర్లోని ఎనర్జీ లెవల్స్‌ని కరెక్ట్‌గా ఎలివేట్ చేస్తూ, డిఫరెంట్ స్టైల్లో సాగే రివెంజ్ డ్రామా ఇది’’ అని సుకుమార్ చెప్పారు. -
నాకిది పెద్ద టర్నింగ్ పాయింట్!
ఇప్పటివరకూ సొంత నిర్మాణ సంస్థ శ్రీనాగ్ కార్పొరేషన్ నిర్మించిన చిత్రాల్లోనే నటించిన సుశాంత్... తొలిసారి బయట సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని అందించిన బీవీఎస్ఎన్ ప్రసాద్... సుశాంత్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నేడు సుశాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం వివరాలను బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలియజేస్తూ -‘‘నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ సుశాంత్‌కి సరిగ్గా సరిపోతుంది. సుశాంత్ కెరీర్‌కి మేలి మలుపుగా నిలిచే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాం. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం ఏప్రిల్‌లో మొదలవుతుంది’’అన్నారు. సుశాంత్‌లోని అన్ని కోణాలను ఆవిష్కరించడమే లక్ష్యంగా తయారు చేసుకున్న కథ ఇదని దర్శకుడు చెప్పారు. ‘‘నా బర్త్‌డే కానుక ఈ సినిమా. బయట సంస్థలో చేస్తే ఓ పెద్ద సంస్థలోనే చేయాలని ఇప్పటిదాకా ఎదురు చూశాను. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి సంస్థలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందీ సినిమా’’అని సుశాంత్ నమ్మకం వెలిబుచ్చారు. భోగవల్లి బాపినీడు ఈ చిత్రానికి సహ నిర్మాత. -
'అత్తారింటికి దారేది' సినిమా లీక్!
-
'అత్తారింటికి దారేది' సినిమా లీక్!
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' సినిమా ఇంకా విడుదల కాకముందే.. పైరసీ సీడీలు వచ్చేశాయి!! ఎడిట్ రూంలో కూర్చున్న ఎవరో తన మిత్రులకు దాన్ని చూపించేందుకు యూట్యూబ్‌లో 90 నిమిషాల పాటు పెట్టగా, ఈలోపే దాన్ని చూసిన కొంతమంది దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసేసి.. పైరసీ సీడీలుగా రూపొందించారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పుడు ఆ చిత్రం పైరేటెడ్ సీడీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసినట్లు అయ్యింది. దాంతో ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు పైరసీదారులపై డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్ర యూనిట్ వాళ్లకు కూడా సినిమా ప్రదర్శన వేయాలేదని... అలాగే ప్రివ్యూ కూడా ఎక్కడా ప్రదర్శించలేనందున లీక్ అయ్యే అవకాశాలు కూడా లేవని తొలుత భావించినా.. తర్వాత మాత్రం అసలు విషయం తెలిసింది. గతంలో కూడా ‘అత్తారింటికి దారేది' ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యేలోపే అందులోని కొన్ని డైలాగులు బయటకు లీకయిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భారీ నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 9న విజయదశమి కానుకగా విడుదల కానుంది. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.