
ఎనర్జీ లెవెల్స్‌కి తగ్గట్టుగా...
ఎనర్జీకి మరోరూపం ఎన్టీఆర్. నవరసాలనూ అలవోకగా పలికించే సత్తా ఉన్న నటుడు ఆయన. ఇక నాట్యం గురించి సరేసరి. కెరీర్ ప్రారంభంలోనే బరువైన పాత్రలు చేసేసి, నటునిగా తనేంటో నిరూపించుకున్నారు ఎన్టీఆర్. అయితే... ప్రస్తుతం మాత్రం ఆయన స్థాయికి తగ్గ కథలు దొరకడం లేదనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేసే బాధ్యతను దర్శకుడు సుకుమార్ తీసుకున్నారు. ఎన్టీఆర్‌లోని ఎనర్జీ లెవల్స్‌ని అద్భుతంగా ఆవిష్కరించే శక్తిమంతమైన కథను ఆయన సిద్ధం చేశారట. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్‌కిది డిఫరెంట్ మూవీ అవుతుంది.
స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్సూ ఉన్న కథ ఇది. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు. ‘‘ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఇదే ప్రథమం. ఎన్టీఆర్‌లోని ఎనర్జీ లెవల్స్‌ని కరెక్ట్‌గా ఎలివేట్ చేస్తూ, డిఫరెంట్ స్టైల్‌లో సాగే రివెంజ్ డ్రామా ఇది’’ అని సుకుమార్ చెప్పారు.