ఎన్టీఆర్ ధరించిన మాస్క్‌ ధరెంతో తెలుసా? | Jr NTR Spotted Wearing Mask Goes Viral In Social media | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ధరించిన మాస్క్‌ ధరెంతో తెలుసా?

Published Sat, Feb 27 2021 11:58 AM | Last Updated on Sat, Feb 27 2021 1:39 PM

Jr NTR Spotted Wearing Mask Goes Viral In Social media - Sakshi

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని కాస్ట్‌లీగానే ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. తాజాగా సుకుమార్‌ ఇంట్లో జరిగిన వేడుకలో పాల్గొన్న జూనియర్‌ ఎన్టీఆర్ ధరించిన మాస్క్‌పై ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. తారక్‌ ధరించిన మాస్క్‌ ధరెంటి? అది ఏ బ్రాండ్‌కి చెందిందంటూ నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు. దీనికి కారణం ఆయన పెట్టుకుంది ఖరీదైన మాస్క్‌ కావడమే. ప్రముఖ యూఎస్‌ స్పోర్ట్స్ కంపెనీకి చెందిన ఈ మాస్క్‌ ధర రూ.2340 వరకు ఉంటుందని సమాచారం.


దీంతో తమ హీరో పెట్టుకున్న మాస్క్‌ తమకు కావాలని ఇప్పటికే ఫ్యాన్స్‌ కొనుగోలు చేస్తున్నారట. ఎన్టీఆర్‌ ధరించిన మాస్క్‌ వైరల్‌ కావడంతో ఆ కంపెనీకి కూడా ఫ్రీగా ప్రమోషన్‌ వచ్చేసింది. గతంలోనూ రాజమౌళి కుమారుని పెళ్లికి హాజరైన ఎన్టీఆర్‌  25 ల‌క్ష‌ల వాచ్,  75 వేల ఖ‌రీదు ఉన్న షూస్ ధ‌రించి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.


ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి రానుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై కూడా హోస్ట్‌గా సందడి చేయడానికి తారక్‌ సిద్ధమయ్యాడు. జెమినీలో ప్రసారం కానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో త్వరలోనే విడుదల కానుంది. 

చదవండి : (త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్‌లు!)
(నాని నో చెప్పాడు.. వైష్ణవ్‌ ఓకే చేశాడు)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement