అక్టోబర్‌లో వస్తున్నాడు | Akhil - Venky Atluri film to kick off in UK | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో వస్తున్నాడు

Published Sun, Jun 10 2018 12:37 AM | Last Updated on Sun, Jun 10 2018 12:37 AM

Akhil - Venky Atluri film to kick off in UK - Sakshi

రెండు నెలలకు సరిపడా వస్తువులన్నింటినీ సూట్‌కేసులో సర్దుకుంటున్నారు అఖిల్‌ అండ్‌ టీమ్‌. ఎందుకంటే.. నెక్ట్స్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం. అఖిల్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్‌ షెడ్యూల్‌ యూకేలో జరగనుంది. ‘‘సినిమా చాలా బాగా వస్తోంది.

నెక్ట్స్‌ రెండు నెలల ఈ సినిమా షెడ్యూల్‌ను యూకేలో ప్లాన్‌ చేశాం. ఆ షెడ్యూల్‌తో దాదాపు 70 పర్సెంట్‌ సినిమా కంప్లీట్‌ అవుతుంది. యూకే నుంచి వచ్చిన తర్వాత మరో నెల రోజులు షూట్‌ జరిపితే సినిమా కంప్లీట్‌ అవుతుంది’’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటు న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement