
గోపీచంద్
యాక్షన్ చిత్రాలవైపు ఎక్కువగా ఆసక్తి చూపించే గోపీచంద్ తాజాగా మరో యాక్షన్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్–బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ల కాంబినేషన్‌లో గతంలో ‘సాహసం’ (2013) అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కొత్త సినిమాతో బిను సుబ్రమణ్యం దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘‘గోపీచంద్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్న చిత్రం ఇది. యాక్షన్ అడ్వంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సతీశ్ కురుప్ కెమెరామన్‌గా వ్యవహరిస్తున ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీహెచ్ నరసింహాచారి.
Comments
Please login to add a commentAdd a comment