సరిహద్దులో సాహసం | Gopichand & Tamil Director Thiru New Movie Launched | Sakshi
Sakshi News home page

సరిహద్దులో సాహసం

Published Tue, Jan 22 2019 3:59 AM | Last Updated on Tue, Jan 22 2019 3:59 AM

Gopichand & Tamil Director Thiru New Movie Launched - Sakshi

తిరు, వెట్రి, గోపీచంద్‌

సినిమాను స్టార్ట్‌ చేయడమే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో మొదలుపెట్టారు గోపీచంద్‌ అండ్‌ టీమ్‌. తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ స్పై థ్రిల్లర్‌ రూపొందుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సోమవారం ఇండియా–పాకిస్థాన్‌ సరిహద్దులో గుజరాత్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. ‘‘50 రోజుల పాటు సాగే షెడ్యూల్‌లో ఫైట్‌ మాస్టర్‌ సెల్వన్‌ కంపోజ్‌ చేసిన సాహసోపేతమైన ఫైట్‌ సీన్స్‌ షూట్‌ చేస్తాం. అలాగే రాజస్థాన్, న్యూ ఢిల్లీలో షూటింగ్‌ జరపనున్నాం. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి, మాటలు: అబ్బూరి రవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement