India-Pak border
-
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..
న్యూఢిల్లీ/శ్రీశ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) దాడికి చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పి కొట్టాయి. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఒక పాకిస్తానీ యుడు హతం కాగా, మరో ఇద్దరు పీఓకేలోకి పరారయ్యారు. ఈ ఘటనలో ఒక జవాను నేలకొరగ్గా ఆర్మీ కెప్టెన్ సహా నలుగురు గాయపడ్డారు. శనివారం ఉదయం ప్రతికూల వాతావరణాన్ని అనువుగా మలుచుకుని బ్యాట్ సభ్యులు కుప్వారా జిల్లాలోని కామకారి సెక్టార్లో ఎల్వోసీని దాడి భారత భూభాగంలోకి ప్రవేశించారు. ట్రెహ్గామ్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ బలగా లు దీటుగా స్పందించాయి. రెండు పక్షాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. బ్యాట్‌లోని ఒక పాకిస్తానీ హతం కాగా, మరో ఇద్దరు పీవోకేలోకి పలాయనం చిత్తగించారు. ఆర్మీ కెప్టెన్ సహా తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే శ్రీనగర్‌లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. రైఫిల్ మ్యాన్ మోహిత్ రాథోడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్యాట్‌లో సాధారణంగా సుశిక్షితులైన పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌తోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు. అమానవీయ చర్యల కు పాల్పడుతూ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతతకు భంగం కలిగించడమే వీరి పని. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటనలు పెరిగిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.మోదీ కొత్త ప్రభుత్వంలో 14 ఉగ్రదాడులు: ప్రియాంకజమ్మూకశ్మీర్లో ఉగ్రమూకల దాడులు పెరిగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పో వడం, మరో నలుగురు గాయపడటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక 49 రోజుల్లో కశ్మీర్లో జరిగిన 14 ఉగ్రదాడుల్లో 15 సైనికులు అమరుల య్యా రన్నారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. -
సరిహద్దులో సాహసం
సినిమాను స్టార్ట్ చేయడమే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుపెట్టారు గోపీచంద్ అండ్ టీమ్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ స్పై థ్రిల్లర్ రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సోమవారం ఇండియా–పాకిస్థాన్ సరిహద్దులో గుజరాత్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. ‘‘50 రోజుల పాటు సాగే షెడ్యూల్లో ఫైట్ మాస్టర్ సెల్వన్ కంపోజ్ చేసిన సాహసోపేతమైన ఫైట్ సీన్స్ షూట్ చేస్తాం. అలాగే రాజస్థాన్, న్యూ ఢిల్లీలో షూటింగ్ జరపనున్నాం. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి, మాటలు: అబ్బూరి రవి. -
సరిహద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం
-
సరిహద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దు విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ సరిహద్దును 2018, డిసెంబర్ వరకు పూర్తిగా మూసివేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ సమయంలో సరిహద్దులో పరిస్థితిని కనిపెట్టి చూస్తామని పేర్కొన్నారు. బోర్డర్ సెక్యురిటీ గ్రిడ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. దీని ద్వారా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటామన్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో శుక్రవారం సరిహద్దు రాష్ట్రాల బీఎస్ ఎఫ్ ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ సమావేశమయ్యారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... దేశభద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. సైన్యం పట్ట పూర్తి విశ్వసనీయత చూపాలని కోరారు. -
చొరబాటుదారుల కాల్పుల్లో భారత జవాను మృతి
న్యూఢిల్లీ/జమ్మూ: మిలిటెంట్లుగా భావిస్తున్న కొందరు మంగళవారం తెల్లవారు జామున జమ్మూ జిల్లాలోని భారత్- పాక్ సరిహద్దు ద్వారా భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక భారత జవాను మరణించాడు. కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబటి జీరోలైన్ వద్ద సోమవారం రాత్రి మరో చొరబాటు యత్నం చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వారిపై కాల్పులు జరపడంతో.. చొరబాటుదారుల్లో ఒకరు చనిపోయారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆదివారం పాక్ మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని ఆర్నియా, ఆర్ఎస్ పుర ప్రాంతాల్లోని 15 సరి హద్దు అవుట్‌పోస్ట్‌లపై, అంతర్జాతీయ సరిహద్దు దగ్గరలో ఉన్న పలు గ్రామాలపై పాక్ సైనికులు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఆరుగురు గాయపడగా, రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రభుత్వం తలవంచదు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ 19 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మంగళవారం ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. అయితే, ప్రతీసారి వారికి భారత్ తగిన సమాధానమిచ్చిందని పేర్కొంది. ‘మేం తల వంచలేదు.. మనం తల వంచుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం రానీయదు’ అని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఒకరికి పదిమంది.. అదే సరైన జవాబు: ‘వారు మన సైనికులను చంపుతూ ఉంటే.. మృతదేహాలను లెక్కిస్తూ ఉండిపోదామా? వారు ఒక భారత సైనికుడిని చంపితే.. మనం పదిమది పాక్ సైనికులను చంపాలి. ఇదే వారికి సరైన సమాధానం’ అని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ తేల్చి చెప్పారు. అగ్రరాజ్యానికి.. మోడీని రానివ్వొద్దు! వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని సెప్టెంబర్ 30న అమెరికాకు రావాల్సిందిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించిన నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా సిక్కు హక్కుల సంఘం(ఎస్ఎఫ్జే-సిక్ ఫర్ జస్టిస్) అగ్రరాజ్యంలో ఆన్లైన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. గుజరాత్లో 2002 నాటి మత విధ్వంసాలను మోడీ రెచ్చగొట్టారని, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేసిందని సంఘం ఆరోపించింది. ఈ నేపథ్యంలో మోడీని అగ్రరాజ్యానికి ఆహ్వానించడం తగదని డిమాండ్ చేసింది.