తిప్పికొట్టిన బలగాలు
ఒక పాకిస్తానీ హతం.. మరో ఇద్దరు పరారీ
ఒక జవాను మృతి, కెప్టెన్ సహా నలుగురికి గాయాలు
న్యూఢిల్లీ/శ్రీశ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) దాడికి చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పి కొట్టాయి. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఒక పాకిస్తానీ యుడు హతం కాగా, మరో ఇద్దరు పీఓకేలోకి పరారయ్యారు. ఈ ఘటనలో ఒక జవాను నేలకొరగ్గా ఆర్మీ కెప్టెన్ సహా నలుగురు గాయపడ్డారు.
శనివారం ఉదయం ప్రతికూల వాతావరణాన్ని అనువుగా మలుచుకుని బ్యాట్ సభ్యులు కుప్వారా జిల్లాలోని కామకారి సెక్టార్‌లో ఎల్‌వోసీని దాడి భారత భూభాగంలోకి ప్రవేశించారు. ట్రెహ్‌గామ్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ బలగా లు దీటుగా స్పందించాయి. రెండు పక్షాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. బ్యాట్‌లోని ఒక పాకిస్తానీ హతం కాగా, మరో ఇద్దరు పీవోకేలోకి పలాయనం చిత్తగించారు.
ఆర్మీ కెప్టెన్ సహా తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే శ్రీనగర్‌లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. రైఫిల్ మ్యాన్ మోహిత్ రాథోడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్యాట్‌లో సాధారణంగా సుశిక్షితులైన పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌తోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు. అమానవీయ చర్యల కు పాల్పడుతూ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతతకు భంగం కలిగించడమే వీరి పని. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటనలు పెరిగిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.
మోదీ కొత్త ప్రభుత్వంలో 14 ఉగ్రదాడులు: ప్రియాంక
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకల దాడులు పెరిగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పో వడం, మరో నలుగురు గాయపడటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక 49 రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన 14 ఉగ్రదాడుల్లో 15 సైనికులు అమరుల య్యా రన్నారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment