అణు, క్షిపణి కార్యక్రమానికి వాడే కీలక యంత్రం ఉన్నట్లు గుర్తింపు
ముంబై: చైనా నుంచి పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఓ అనుమానాస్పద ఓడను భారత భద్రతా అధికారులు ముంబైలోని నావసేవ పోర్టులో నిలిపివేశారు. అందులో ఉన్న సామగ్రి పాక్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు సైతం ఉపయోగపడు తుందని గుర్తించారు. మాల్టాకు చెందిన సీఎంఏ సీజీఎం అత్తిలా అనే ఓడ పాక్‌లో ని కరాచీ రేవు పట్టణానికి వెళ్తుండగా జనవరి 23వ తేదీన కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు.
మొత్తం 22 టన్నుల బరువున్న ఈ సామగ్రిలో ఇటలీ తయారీ కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్(సీఎన్‌సీ)అనే యంత్రం ఉన్నట్లు గుర్తించారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఈ యంత్రాన్ని కంప్యూటర్‌తో ఆపరేట్ చేయొచ్చు. అనంతరం దీనిని పరిశీలించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)అధికారులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment