Indian security forces
-
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..
న్యూఢిల్లీ/శ్రీశ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) దాడికి చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పి కొట్టాయి. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఒక పాకిస్తానీ యుడు హతం కాగా, మరో ఇద్దరు పీఓకేలోకి పరారయ్యారు. ఈ ఘటనలో ఒక జవాను నేలకొరగ్గా ఆర్మీ కెప్టెన్ సహా నలుగురు గాయపడ్డారు. శనివారం ఉదయం ప్రతికూల వాతావరణాన్ని అనువుగా మలుచుకుని బ్యాట్ సభ్యులు కుప్వారా జిల్లాలోని కామకారి సెక్టార్లో ఎల్వోసీని దాడి భారత భూభాగంలోకి ప్రవేశించారు. ట్రెహ్గామ్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ బలగా లు దీటుగా స్పందించాయి. రెండు పక్షాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. బ్యాట్‌లోని ఒక పాకిస్తానీ హతం కాగా, మరో ఇద్దరు పీవోకేలోకి పలాయనం చిత్తగించారు. ఆర్మీ కెప్టెన్ సహా తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే శ్రీనగర్‌లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. రైఫిల్ మ్యాన్ మోహిత్ రాథోడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్యాట్‌లో సాధారణంగా సుశిక్షితులైన పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌తోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు. అమానవీయ చర్యల కు పాల్పడుతూ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతతకు భంగం కలిగించడమే వీరి పని. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటనలు పెరిగిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.మోదీ కొత్త ప్రభుత్వంలో 14 ఉగ్రదాడులు: ప్రియాంకజమ్మూకశ్మీర్లో ఉగ్రమూకల దాడులు పెరిగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పో వడం, మరో నలుగురు గాయపడటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక 49 రోజుల్లో కశ్మీర్లో జరిగిన 14 ఉగ్రదాడుల్లో 15 సైనికులు అమరుల య్యా రన్నారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. -
పాక్ వెళ్తున్న ఓడ ముంబైలో నిలిపివేత
ముంబై: చైనా నుంచి పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఓ అనుమానాస్పద ఓడను భారత భద్రతా అధికారులు ముంబైలోని నావసేవ పోర్టులో నిలిపివేశారు. అందులో ఉన్న సామగ్రి పాక్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు సైతం ఉపయోగపడు తుందని గుర్తించారు. మాల్టాకు చెందిన సీఎంఏ సీజీఎం అత్తిలా అనే ఓడ పాక్‌లో ని కరాచీ రేవు పట్టణానికి వెళ్తుండగా జనవరి 23వ తేదీన కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. మొత్తం 22 టన్నుల బరువున్న ఈ సామగ్రిలో ఇటలీ తయారీ కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్(సీఎన్సీ)అనే యంత్రం ఉన్నట్లు గుర్తించారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఈ యంత్రాన్ని కంప్యూటర్‌తో ఆపరేట్ చేయొచ్చు. అనంతరం దీనిని పరిశీలించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)అధికారులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. -
కశ్మీర్లో పాక్ దుస్సాహసం
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. పాక్ కాల్పులకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉడి, గురెజ్ సెక్టార్ల మధ్య పాకిస్తాన్ మోర్టార్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని, పౌర ఆవాసాలు లక్ష్యంగా కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. భారత్ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు భారీగా నష్టం జరిగిందని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ సైన్యానికి చెందిన మౌలిక వసతుల ప్రాంతాలు ధ్వంసమయ్యాయని వివరించారు. కొన్ని ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ఉపయోగించే స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు. కల్నల్ కాలియా తెలిపిన వివరాల మేరకు... పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. హజీపీర్ సెక్టార్లో పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్ చనిపోయారు. ఒక జవాను గాయపడ్డారు. కమల్‌కోటే సెక్టార్లో ఇద్దరు పౌరులు, బాలాకోట్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. ఉడి సెక్టార్‌లోని నంబ్లా ప్రాంతంలో పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే కుయత్నాన్ని తిప్పికొట్టామని కల్నల్ కాలియా వెల్లడించారు. ‘కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో ఎల్ఓసీ వెంట అనుమానాస్పద కదలికలను మన బలగాలు గుర్తించాయి. అది ఉగ్రవాదుల చొరబాటుగా గుర్తించి, వెంటనే స్పందించి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి’ అని వివరించారు. ఈ వారంలో ఇది రెండో చొరబాటు యత్నమని, మాచిల్ సెక్టార్లో ఈనెల 7న రాత్రి కూడా ఒక చొరబాటు యత్నాన్ని అడ్డుకుని, ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామన్నారు. పూంఛ్‌లోని పలు ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులకు, మోర్టార్ షెల్లింగ్నకు పాల్పడిందని, భారత బలగాలు వాటికి దీటుగా స్పందించాయని జమ్మూలో రక్షణ శాఖ అధికారి తెలిపారు. ‘పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్ఎఫ్లో చేరారు. ఆయనకు తండ్రి, భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. దేశ రక్షణలో ఆయన వీర మరణం పొందారు’ అని ఢిల్లీలోని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్ లొకేషన్లో ఎస్ఐ రాకేశ్ దోవల్‌తో పాటు విధుల్లో ఉన్న కాన్స్టేబుల్ వాసు రాజాకు గాయాలయ్యాయని, ఆయన చికిత్స పొందుతున్నారని వివరించారు. -
మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం
న్యూఢిల్లీ/గుర్గావ్: దేశానికి చెందిన భూభాగం యావత్తూ మన భద్రతా బలగాల పూర్తి రక్షణలోనే ఉందని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ స్పష్టం చేశారు. ఆదివారం గుర్గావ్లో బీఎస్ఎఫ్ ఆధ్వ ర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జనరల్ దేశ్వాల్ మాట్లాడు తూ..‘మన దేశ భూభాగమంతా మన చేతుల్లోనే ఉంది. పూర్తిగా మన భద్రతా బలగాల అధీనంలోనే ఉంది. మన సరి హద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి. మన బలగాలు చురుగ్గా, సమర్ధంగా, అం కితభావంతో పనిచేస్తున్నాయి. సరిహ ద్దుల్లో ఎలాంటి శత్రువునైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని తెలిపారు. కాగా, ఫింగర్ –4 వద్ద మోహ రించిన బలగాల్లో మరికొన్నిటినీ, పాంగాం గ్ సో సరస్సులో ఉన్న కొన్ని గస్తీ పడవలను చైనా ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ పూర్తిగా చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలకు తుదిరూపం ఇచ్చేందుకు భారత, చైనా బలగాల మధ్య మరో విడత చర్చలు జరగనున్న నేప థ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
‘పాకిస్తాన్ కూడా మీలా ప్రశ్నించలేదు’
లక్నో: భారత సైనిక బలగాల సామర్థ్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నించిన విధంగా శత్రుదేశం పాకిస్తాన్ కూడా ప్రశ్నించలేదని ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైనిక బలగాలపై దేశ ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకముందని, కానీ కొంతమంది నేతలకే వారిపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లను హేలనచేసే విధంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి మాట్లాడే విధంగా పాకిస్తాన్‌కు చెందిన నాయకులు కూడా భారత సైన్యంపై చులకనగా మాట్లాడలేదని అన్నారు. విపక్షాలతో వ్యాఖ్యలతో సైనికుల ఆత్మసైర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని మౌర్య విమర్శించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లతో పోలిస్తే యూపీతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ చేతులు కలిపినా తమకు జరిగే నష్టమేమీ లేదనిఅన్నారు. బలమైన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అది ప్రధాని మోదీతోనే సాధ్యమని మౌర్య అభిప్రాయపడ్డారు. -
కంచె దాటే యత్నం; ఆరుగురు హతం
శ్రీనగర్: భారత భద్రతా బలగాలు కుపర్వా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఆదివారం పాకిస్తాన్ తీవ్రవాదుల భారీ చొరబాటుని అడ్డుకున్నాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నిసున్న ఆరుగురిని కాల్చి చంపాయి. కీరన్ సెక్టార్లో ఆదివారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ‘దేశంలోకి చొరబాటుకు యత్నించిన ఆరుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. తప్పించుకుపోయిన మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చ’ని రక్షణ శాఖ ప్రతినిధినొకరు తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెక్కకు మించి భద్రతా దళాలను మోహరిచండంతోనే అనేక మంది యువకులు తీవ్రవాదం వైపు మళ్లుతున్నారనే ఆరోపణలు నిజం కాదని అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా భారత భద్రతా బలగాలు ఎటువంటి తీవ్రవాద నిర్మూలన ఆపరేషన్లు చేపట్టలేదనీ, కాల్పుల విరమణ పాటిస్తున్నాయని గుర్తు చేశారు. కశ్మీర్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందనీ, అయినా కొంతమంది యువకులు తీవ్రవాదం అడుగులేస్తున్నారని ఆర్మీ మాజీ బ్రిగేడియర్ అనిల్ గుప్తా అన్నారు. -
జనావాసాలపై పాక్ దాడులు
- మోర్టారు బాంబులతో ఘాతుకం - 8 మంది భారత పౌరుల మృతి.. 22 మందికి గాయాలు - మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు - పాక్ దాడులకు దీటుగా జవాబిచ్చిన భారత ఆర్మీ - ఇద్దరు రేంజర్ల హతం సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత్‌ను మరింత కవ్వించేందుకు సామాన్య పౌరులే లక్ష్యంగా మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు నుంచే జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరీ జిల్లాలోని పీవోకే, ఐబీ వెంట మొదలు పెట్టిన దాడిలో 8 మంది పౌరులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇంత పెద్దసంఖ్యలో పౌరులు మృతిచెందటం ఇదే తొలిసారి. కాగా సరిహద్దు పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్ సమీక్షించారు. జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత్‌ను మరింత కవ్వించేందుకు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే మొదలుపెట్టిన దాడిలో 8 మంది పౌరులు మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇంతపెద్ద సంఖ్యలో పౌరులు మృతిచెందటం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పీవోకే, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్లతో పాక్ దాడికి దిగిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో పాక్ దాడుల్లో ఐదుగురు మరణించగా.. మరోవ్యక్తి షాక్‌తో మృతిచెందాడని, 9 మంది గాయపడ్డారని తెలిపాయి. గాయపడిన వారికి రామ్‌గఢ్ ఆస్పత్రిలో ప్రథమచికిత్స చేసి జమ్మూ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజౌరీ జిల్లాలోని మంజాకోటే సరిహద్దు గ్రామంలో ఇద్దరు మహిళలు మోర్టారు దాడుల్లో మృతిచెందగా.. ముగ్గురు ఆర్మీ పోర్టర్లకు కూడా గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. పూంచ్ సెక్టార్లో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. రాజౌరీలో ఉదయం మొదలైన కాల్పులు ఈ మూడు జిల్లాల్లో విస్తరించాయని బీఎస్ఎఫ్ డీఐజీ ధర్మేంద్ర పరీక్ వెల్లడించారు. ‘82 ఎంఎం మెర్టార్లతో అడపాదడపా కవ్వించారు. రాజౌరీలోని ఓ చిన్న గ్రామంలో సుల్తాన్ బేగం, మక్బూల్ బేగం అనే ఇద్దరు యువతులు మృతిచెందారు. పాక్ దాడులకు ఆర్మీ దీటైన సమాధానమిచ్చింది’ అని పరీక్ తెలిపారు. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్లో ఉదయం 7 గంటలకు జరిగిన మోర్టారు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఉదయం 5.30 నుంచే పాక్ కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. పాక్ దళాలు చిన్న, ఆటోమేటిక్ గన్లతో మొదలుపెట్టి.. మోర్టార్లతో దాడికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం నుంచి జరిగిన ఘటనల్లో పౌరులకు తీవ్ర నష్టం జరిగింది’ అని ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా తెలిపారు. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ 60సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. పాక్ కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన సర్కారు.. సరిహద్దు వెంబడి గ్రామాల్లోని 174 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. రాజ్‌నాథ్, పరీకర్ సమీక్ష సరిహద్దు పరిస్థితిని హోంమంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్ సమీక్షించారు. 8 మంది మృతి, 22 మందికి గాయాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. భేటీలో మంత్రులతోపాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సుహాగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 14 పాక్ పోస్టులు ధ్వంసం నియంత్రంణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలకూ భారత ఆర్మీ దీటైన జవాబిచ్చింది. రాజౌరీలోని నౌషెరా సెక్టార్లో ఇద్దరు భారత్ జవాన్లు జరిపిన ఎదురుదాడిలో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అటు జమ్మూలోని ఆర్నియా సెక్టార్‌కు సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ జరిపిన ఎదురుదాడిలో 14 పాక్ పోస్టులు ధ్వంసమయ్యాయని ఆర్మీ పేర్కొంది. -
పాక్‌ను దీటుగా దెబ్బకొడుతున్న సైన్యం!
జమ్మూ: పాకిస్థాన్ సైన్యం పెట్రేగిపోతుండటంతో సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం మంగళవారం విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది భారత పౌరులు ప్రాణాలు విడిచారు. 22 మంది గాయపడ్డారు. దీంతో భారత్ సైన్యం దీటుగా బదులిచ్చింది. మన సైన్యం జరిపిన ప్రతి కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు విడిచారు. సరిహద్దులకు ఆవల ఉన్న 14 పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. పాక్ సైన్యం ఏకపక్షంగా కాల్పులకు దిగుతుండటంతో గతకొన్నాళ్లుగా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి పాక్ సైన్యాలు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా కాల్పులతో హోరెత్తిస్తున్నాయి. సాంబా, జమ్మూ, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు చేరువగా ఉన్న గ్రామాలు, సైనిక పోస్టులు లక్ష్యంగా భారీ తుపాకులతో కాల్పులు ప్రారంభించాయి. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు కూడా దీటుగా బదులిస్తున్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన ప్రతి కాల్పుల్లో రామ్‌గఢ్, ఆర్నియా సెక్టర్లలోని 14 పాకిస్థాన్ రేంజర్స్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారని బీఎస్ఎఫ్ తెలిపింది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకొని పాక్ కాల్పులు చేస్తుండటంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. -
సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణకు మళ్లీ గండికొట్టింది. శనివారం తొమ్మిది అవుట్‌పోస్టులపై పాక్ జరిపిన భారీ కాల్పులు, మోర్టారు బాంబు దాడుల్లో జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన ఇద్దరు సామాన్య పౌరులు గాయపడ్డారు. ఓ పాఠశాల బస్సుతో పాటు ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఈ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని పశువులు కూడా మృతిచెందినట్లు భద్రతాధికారులు అధికారులు తెలియజేశారు. కొన్ని ఇళ్లపై మోర్టారు బాంబులు దూసుకొచ్చాయని, గోడలు నెర్రెలు విచ్చాయని వెల్లడించారు. పాక్ దాడులను భారత భద్రతా బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. మరోపక్క..అంతర్జాయతీయ సరిహద్దు వెంట శుక్రవారం రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.