సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు | In the incessant fire on the border in Pakistan | Sakshi
Sakshi News home page

సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు

Published Sun, Oct 25 2015 1:30 AM | Last Updated on Sat, Mar 23 2019 8:09 PM

సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు - Sakshi

సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు

జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణకు మళ్లీ గండికొట్టింది. శనివారం తొమ్మిది అవుట్‌పోస్టులపై పాక్ జరిపిన భారీ కాల్పులు, మోర్టారు బాంబు దాడుల్లో  జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన ఇద్దరు సామాన్య పౌరులు గాయపడ్డారు. ఓ పాఠశాల బస్సుతో పాటు ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఈ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని పశువులు కూడా మృతిచెందినట్లు భద్రతాధికారులు  అధికారులు తెలియజేశారు. కొన్ని ఇళ్లపై మోర్టారు బాంబులు దూసుకొచ్చాయని, గోడలు  నెర్రెలు విచ్చాయని వెల్లడించారు.

పాక్ దాడులను భారత భద్రతా బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.  మరోపక్క..అంతర్జాయతీయ సరిహద్దు వెంట శుక్రవారం రాత్రి పాకిస్తాన్  జరిపిన దాడిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement