
దొరికింది దోచే సేయ్..!
జీవితంలో మోసం చేసి పైకి రావడం చాలా ఈజీ. కొంత మంది స్వార్ధంతో మోసం చే స్తే మరి కొంత మంది మోసంలో మంచి కూడా ఉంటుంది. మరి ఈ కథలో హీరో కూడా దొరికింది దోచేస్తాడు...కానీ ఒక కారణం ఉంది.... మరి అదేంటో తెలియాలంటే ‘దోచేయ్’ చూడాల్సిందే. నాగచైతన్య, కృతీసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘అభిమానుల అంచనాలను అందుకునేలా సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్ ఈదర.