dochey
-
నేనేమిటి?
‘లవ్ ఫెయిల్యూర్’, ‘స్వామి రారా’, ‘దోచెయ్’, ‘త్రిపుర’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తార... పూజా రామచంద్రన్. ‘బిగ్‌బాస్’ షోతో మరింత దగ్గరైన పూజా ‘లా’ సినిమాతో మరోసారి పలకరించింది. ఆమె తన గురించి తాను చెప్పిన ముచ్చట్లు కొన్ని... అయ్యో! కోయంబత్తూరులో విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నాను. యస్‌యస్ మ్యూజిక్‌లో వీజేగా చేస్తున్నప్పుడు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ‘నేను నటించగలనా!’ అనే భయంతో సారీ చెప్పేశాను. నేను వద్దనుకున్న కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయినప్పుడు మాత్రం ‘అయ్యో’ అనిపించింది.‘లవ్ ఫెయిల్యూర్’లో నటించిన తరువాత మాత్రం... ‘ఫరవాలేదు. నేను నటించగలను’ అనే నమ్మకం వచ్చింది. భయం వద్దు! ‘ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇదే జానర్లో సుదీర్ఘకాలం పాటు నటించాలి’ అనే ఆశ లేదు. తొందరపాటు లేదు. నా కెరీర్‌గ్రాఫ్ గురించి సంతృప్తిగా ఉన్నాను. ఏ పని చేసినా సానుకూల దృక్పథంతో చేయడం మొదటి నుంచీ అలవాటు. ‘అలా జరుగుతుందేమో’ ‘ఇలా జరుగుతుందేమో’లాంటి ప్రతికూల ఆలోచనలను దగ్గరికి రానివ్వను.మనలో ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు ‘భయం’లో బందీలమవుతాం. ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయపడతాం. ఇలా అయితేనే... నేను చేసే సినిమాలో అయిదు సీన్లు ఉన్నాయా, పది సీన్లు ఉన్నాయా అనే దాని గురించి ఆలోచించను. చేసే పాత్ర నాకు క్రియేటివ్ శాటిస్పెక్షన్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి. నేను ఎవరితో కలిసి పనిచేస్తున్నాను అనేది కూడా పరిగణనలోకి తీసుకుంటాను.తిండిగింజల మీద రాసి పెట్టి ఉన్నట్లుగానే పాత్రల విషయంలోనూ జరుగుతుందని నమ్ముతాను. హ్యాపీగా! బిగ్‌బాస్ షో వల్ల ‘నేనేమిటి?’ అనేది తెలిసిపోతుంది.మరి నేనేమిటీ? ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకుంటాను. పాజిటివ్‌గా ఆలోచిస్తాను. ఒకరి గురించి ఏదైనా అభిప్రాయం ఉంటే చాటుమాటుగా కాకుండా సూటిగా చెబుతాను. పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ‘ఒక విషయం గురించి పదిమంది ఇలా అనుకుంటున్నారు. నేను కూడా అలా అనుకోకపోతే బాగోదు’ అనే మనస్తత్వం నాది కాదు.పదిమందికి ఒక అభిప్రాయం ఉన్నా, అది నా అభిప్రాయానికి సరిపోకపోతే విభేదిస్తాను! -
దొరికింది దోచే సేయ్..!
జీవితంలో మోసం చేసి పైకి రావడం చాలా ఈజీ. కొంత మంది స్వార్ధంతో మోసం చే స్తే మరి కొంత మంది మోసంలో మంచి కూడా ఉంటుంది. మరి ఈ కథలో హీరో కూడా దొరికింది దోచేస్తాడు...కానీ ఒక కారణం ఉంది.... మరి అదేంటో తెలియాలంటే ‘దోచేయ్’ చూడాల్సిందే. నాగచైతన్య, కృతీసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘అభిమానుల అంచనాలను అందుకునేలా సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్ ఈదర. -
‘డి.టి.ఎస్’ మధుసూదనరెడ్డి హఠాన్మరణం
ప్రముఖ శబ్దగ్రాహకుడు, డి.టి.ఎస్. మిక్సింగ్‌లో సుప్రసిద్ధుడూ అయిన సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదనరెడ్డి ఇక లేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో, సోమవారం ఉదయం ఆయన హఠాత్తుగా కన్నుమూశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ‘దోచేయ్’ చిత్రం మిక్సింగ్ పనిలో తీరిక లేకుండా ఉండి, ఆ వ్యవహారం పూర్తి చేసుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నిద్ర లేచి, పిల్లల స్కూలు పని మీద వెళ్ళి ఇంటికి తిరిగొస్తూ, మెట్ల మీదే ఆయనే కుప్పకూలిపోయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కొద్ది గంటల క్రితం దాకా తమ మధ్యే సినిమా పనిలో గడిపిన మధుసూదనరెడ్డి హఠాన్మరణం తెలుగు సినీ పరిశ్రమ వర్గీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిండా యాభయ్యేళ్ళు కూడా లేని మధుసూదనరెడ్డి సినీ శబ్దగ్రహణ విభాగంలో పేరున్న సాంకేతిక నిపుణుడు. ఆయనకు భార్య శశి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న ఆయన ప్రముఖ ఆడియోగ్రాఫర్ స్వామినాథన్ వద్ద శిష్యరికం చేశారు. మధుసూదనరెడ్డి స్వతంత్రంగా ఆడియోగ్రాఫర్‌గా చేసిన చిత్రాల్లో ‘గులాబి’, ‘సిసింద్రీ’ మొదలు మహేశ్ ’ఒక్కడు’, అనుష్క ‘అరుంధతి’, గత ఏడాది రిలీజైన అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ మొదలైనవి అనేకం ఉన్నాయి. ఇంజనీర్‌గా మొదలుపెట్టి సౌండ్ రికార్డిస్టుగా, డిజైనర్‌గా ఎదిన ఆయన గడచిన రెండు దశాబ్దాల పైచిలుకు కెరీర్లో దాదాపు 125 చిత్రాలకు పైగా శబ్ద గ్రహణం చేశారు. అందరూ ‘డి.టి.ఎస్. మధు’ అని ముద్దుగా పిలుచుకొనే ఆయన పని విషయంలో నాణ్యతకూ, నిర్దుష్టతకూ మారుపేరు. సినిమా విడుదలైన తరువాత కూడా సౌండ్ సరిగా లేదని తనకు అసంతృప్తి కలిగితే, ఔట్‌పుట్‌ను మార్చి, కొత్త ప్రింట్లు పంపేవారు. శబ్ద విభాగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని ఆకళింపు చేసుకొని, వాటిని నిత్యం పనిలో వాడే మధుసూదనరెడ్డికి ‘ఒక్కడు’, ‘అరుంధతి’ తదితర చిత్రాలు నంది పురస్కారాలు తెచ్చాయి. శబ్దగ్రహణ శాఖలో 9 సార్లు నంది అవార్డులు అందుకున్న ఘనుడాయన. ఎంతో పేరొచ్చినా, అందరితో స్నేహంగా ఉంటూ మంచిమనిషిగా పేరు తెచ్చుకున్నారు. చాలాకాలం ఆయన రామానాయుడు స్టూడియోలో పనిచేశారు. కొంతకాలం క్రితం స్టూడియో నుంచి బయటకొచ్చేసి, హైదరాబాద్‌లోని మణికొండలో ఆఫీసు పెట్టుకొని, శబ్దగ్రహణంలో కృషి చేస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో సహా చాలామంది మిక్సింగ్‌కు మధుసూదనరెడ్డినే ఆశ్రయించేవారంటే, ఆయన పని మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి టెక్నీషియన్‌ను కోల్పోయామంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
చైతూని లారెన్స్ భయపెడుతున్నాడా?
-
'దోచేయ్' అంటున్న నాగ చైతన్య..!