మరో థ్రిల్లర్‌తో... | Virupaksha director Karthik Dandu set to helm a mythical thriller | Sakshi
Sakshi News home page

మరో థ్రిల్లర్‌తో...

Published Tue, Aug 15 2023 2:00 AM | Last Updated on Tue, Aug 15 2023 2:00 AM

Virupaksha director Karthik Dandu set to helm a mythical thriller - Sakshi

‘విరూపాక్ష’ సినిమాతో ఘనవిజయం అందుకున్న డైరెక్టర్‌ కార్తీక్‌ దండు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ‘విరూపాక్ష’ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ప్రీ లుక్‌ ΄ోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘విరూపాక్ష’ను మిస్టిక్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన కార్తీక్‌ దండు తన తదుపరి చిత్రాన్ని మిథికల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తీయబోతున్నాడు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement