‘టిల్లు స్క్వేర్‌’ ట్రైలర్‌ వచ్చేస్తోంది! | Siddhu Jonnalagadda Jack movie motion poster released | Sakshi
Sakshi News home page

‘టిల్లు స్క్వేర్‌’ ట్రైలర్‌ వచ్చేది అప్పుడే

Published Thu, Feb 8 2024 4:19 AM | Last Updated on Thu, Feb 8 2024 7:54 AM

Siddhu Jonnalagadda Jack movie motion poster released - Sakshi

‘డీజే టిల్లు’ వంటి హిట్‌ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్‌) అప్‌డేట్స్‌ ఇచ్చారు మేకర్స్‌. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసి, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘కొంచెం క్రాక్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.

త్వరలో ట్రైలర్‌: ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్‌ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది యూనిట్‌. ఈ మూవీ ట్రైలర్‌ ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement