'మీ నాన్నకు తెలియనంత జాబ్ ఏం చేస్తున్నావ్?'.. ఆసక్తిగా టీజర్ | Tollywood Hero Siddu Jonnalagadda Latest Movie Jack Teaser Out Now | Sakshi

Jack Teaser: 'మీ నాన్నకు తెలియనంత జాబ్ ఏం చేస్తున్నావ్?'.. ఆసక్తిగా టీజర్

Feb 7 2025 7:10 PM | Updated on Feb 7 2025 8:04 PM

Tollywood Hero Siddu Jonnalagadda Latest Movie Jack Teaser Out Now

టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) 'జాక్' (Jack)మూవీతో అభిమానులను అలరించనున్నారు. గతేడాది టిల్లు స్క్వేర్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించిన సిద్ధు మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న జాక్‌లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవాళ సిద్ధు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా జాక్ మూవీ టీజర్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు.

టీజర్‌ చూస్తే తండ్రి, కుమారుల మధ్య జరిగే స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు అర్థమవుతోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, సిద్ధు మధ్య వచ్చే డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement