ఇంటర్‌నేషనల్‌ గూఢచారిగా వరుణ్‌ తేజ్‌.. యాక్షన్‌ బిగిన్‌ | Varun Tej starts shooting for next film in London | Sakshi
Sakshi News home page

ఇంటర్‌నేషనల్‌ గూఢచారిగా వరుణ్‌ తేజ్‌.. యాక్షన్‌ బిగిన్‌

Published Tue, Oct 11 2022 6:25 AM | Last Updated on Tue, Oct 11 2022 9:24 AM

Varun Tej starts shooting for next film in London - Sakshi

గన్‌ను ఫుల్‌గా లోడ్‌ చేసి రంగంలోకి దిగారు వరుణ్‌ తేజ్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్‌వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ సోమవారం లండన్‌లో ప్రారంభమైంది. హీరో వరుణ్‌ తేజ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘షూటింగ్‌ మొదలైంది. ది గేమ్‌ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌ బిగిన్స్‌’ అంటూ లొకేషన్‌ వీడియోను షేర్‌ చేశారు వరుణ్‌ తేజ్‌. కాగా ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఇంటర్‌నేషనల్‌ గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement