
‘‘ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ భాషలో చేసినా ఆ భాషకి సరిపోతారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘భామా కలాపం’ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రియమణి నటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రదర్శకుడు భరత్ కమ్మ ఈ షోకి రన్నర్. ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి∙‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
‘భామా కలాపం’ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను ఆదరించారు.. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్ తీసిన ఈ వెబ్ సిరీస్‌ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘భామా కలాపం’లో అనుపమ అనే చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ప్రియమణి. ‘‘మేము అనుకున్న దాని కంటే అభిమన్యు బాగా డైరెక్ట్ చేశాడు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఏడాది క్రితం సరదాగా రాసుకున్న కథ ఇక్కడివరకు రావడం హ్యాపీ’’ అన్నారు అభిమన్యు తాడిమేటి.
Comments
Please login to add a commentAdd a comment