రాత్రిపూట రైల్వే స్టేషన్‌లో..! | Varun Varun Tej and Rashekhanma are currently shooting in Hyderabad. | Sakshi
Sakshi News home page

రాత్రిపూట రైల్వే స్టేషన్‌లో..!

Published Thu, Jul 27 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

రాత్రిపూట రైల్వే స్టేషన్‌లో..!

రాత్రిపూట రైల్వే స్టేషన్‌లో..!

అమ్మాయిని ఆటపట్టిస్తే అందంగా ఉంటుంది. అల్లరిపాలు చేయాలని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఓ రాత్రిపూట అందమైన అమ్మాయి కనిపించగానే కొందరు పోకిరీలు అల్లరిపాలు చేయాలని చూశారు. పక్కనే ఉన్న ఓ అబ్బాయి థియేటర్లో సినిమా చూస్తున్నట్టు... పోకిరీ పనులను చూస్తూ ఊరుకోలేదు. రెండు పీకడం మొదలెట్టాడు.

అంత మంచి మనసున్నోడు ఎవరో కాదు... వరుణ్‌ తేజ్‌. ఆ అందమైన అమ్మాయి రాశీఖన్నా. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న సినిమాలో సన్నివేశమిది. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

రైల్వే స్టేషన్‌లో రాత్రిపూట జరిగే సన్నివేశాలను, చిన్న ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారట. హీరో వరుణ్‌ తేజ్, హీరోయిన్‌ రాశీ ఖన్నా, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘మరో అందమైన ప్రేమకథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నా. నా నెక్స్‌›్ట ఫిల్మ్‌ షూటింగ్‌ మొదలైంది’’ అని వరుణ్‌ తేజ్‌ పేర్కొన్నారు. ‘ఫిదా’ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement