
‘శబ్దం’ సినిమా పోస్టర్
నారా వారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు నారారోహిత్. పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.... తను మాత్రం ప్రయోగాత్మక పాత్రలోనే నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. నారా రోహిత్ సినిమా అంటే కొత్తగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.
తాజాగా నారారోహిత్ మూగవాడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఉగాది సందర్భంగా లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు శబ్దం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వికాస్ కురిమెళ్ల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment