సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | Biksha Movie Opening in Hyderabad | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Jun 23 2020 1:23 AM | Updated on Jun 23 2020 1:23 AM

Biksha Movie Opening in Hyderabad - Sakshi

ప్రియాన్ష, కుశాల్, అనోన్య

తేజేశ్వర రెడ్డి, సిద్ధార్థ, భరత్‌ సాగర్‌ హీరోలుగా ప్రియాన్ష, అనోన్య హీరోయిన్లుగా మాస్టర్‌ కుశాల్‌ రెడ్డి కీలక పాత్రలో నటించనున్న చిత్రం ‘భిక్ష’. ‘మహానగరంలో శివచందు’, ‘సాయే దైవం’, ‘2 ఫ్రెండ్స్‌’, ‘స్నేహవే ప్రీతి (కన్నడ)’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జిఎల్‌బి శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

జిఎల్‌బి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ప్రభుత్వం విధించిన కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మా చిత్రాన్ని ప్రారంభించాం. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టి, హైదరాబాద్, కరీంనగర్, కంఠాత్మకూర్, హంపీ, విజయవాడ, వైజాగ్‌లలో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్ర రెడ్డి, సంగీతం: శ్రీపాల్, సహ నిర్మాత: తీగుళ్ళ స్వప్నకిరణ్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భిక్షపతి గౌడ్‌ వడ్డేపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement