రేపే శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం! | Sree Vishnu New Movie Opening On 22nd June | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 4:23 PM | Last Updated on Thu, Jun 21 2018 4:30 PM

Sree Vishnu New Movie Opening On 22nd June - Sakshi

అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ లాంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నారు యువ హీరో శ్రీ విష్ణు. మొదట్లో సహాయ పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు ప్రస్తుతం సోలో హీరోగా ట్రై చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటున్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ.. తన నటనతో అందరినీ మెప్పిస్తోన్న ఈ యువ హీరో మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. 

రేపు (జూన్‌ 22) ఉదయం 11 గంటల 27ని. లకు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నారా రోహిత్‌ ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓం శ్రీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీ ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement