నూటొక్క జిల్లాలకే అందగాడు | Srinivas Avasarala and Ruhani Sharma team up for Nootokka Jilla Andagadu | Sakshi
Sakshi News home page

నూటొక్క జిల్లాలకే అందగాడు

Published Sun, Oct 20 2019 12:06 AM | Last Updated on Sun, Oct 20 2019 12:06 AM

Srinivas Avasarala and Ruhani Sharma team up for Nootokka Jilla Andagadu - Sakshi

ప్రారంభోత్సవంలో చిత్రబృందం

ఒక వ్యక్తి బాగా అందంగా ఉంటే నూటొక్క జిల్లాల అందగాడు అని సంబోధిస్తారు. అప్పట్లో నూతన్‌ ప్రసాద్‌ని అలా పిలిచేవారు. ఇప్పుడు తాజా సినిమా కోసం అవసరాల శ్రీనివాస్‌ నూటొక్క జిల్లాల అందగాడిగా మారనున్నారు. అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కనున్న చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ‘దిల్‌’ రాజు, దర్శకుడు క్రిష్‌ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పించడం విశేషం. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. సాగర్‌ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ చిత్రానికి రచయిత: అవసరాల శ్రీనివాస్, సంగీతం: స్వీకార్‌ అగస్తీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement