కొత్త జంట | Sudheer Babu to romance Mehreen | Sakshi
Sakshi News home page

కొత్త జంట

Published Thu, Aug 16 2018 5:30 AM | Last Updated on Thu, Aug 16 2018 5:30 AM

Sudheer Babu to romance Mehreen - Sakshi

సుధీర్‌బాబు,మెహారీన్‌

‘సమ్మోహనం’ సినిమాతో నటనలో మరో మెట్టు పైకి ఎక్కారు సుధీర్‌బాబు. వచ్చే నెల ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఈ ఏడాది మళ్లీ థియేటర్‌లోకి రానున్నారాయన. మరి.. ఇప్పుడేం చేస్తున్నారు అంటే కొత్త సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో మెహారీన్‌ కథానాయికగా నటిస్తారు. రిజ్వాన్‌ నిర్మించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం జరగనుంది. నిర్మాత ‘దిల్‌’రాజు, దర్శకుడు వీవీ వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఖుర్షీద్‌ సహ నిర్మాత. ఇలా మొత్తానికి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ మస్త్‌ బిజీగా ఉంటున్నారు హీరో సుధీర్‌బాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement