![Actress Varalaxmi Sarathkumar New Movie Opening - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/16/varalakshmi%20sharat%20kumar.jpg.webp?itok=TKYenEZI)
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాకు ‘అర్జునుడి గీతోపదేశం’ టైటిల్‌ను ఖరారు చేశారు. అఖిల్ రాజ్, దివిజా ప్రభాకర్, రాజీవ్, ఆదిత్యా శశికుమార్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాతో సతీష్ గోగాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిలోక్‌నాథ్. కె, ప్రదీప్ రెడ్డి .వి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
తొలి సన్నివేశానికి మల్లాల సీతారామరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, కె. అమ్మిరాజు క్లాప్ ఇచ్చారు. లక్కంశెట్టి వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సతీష్ గోగాడ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. మొదటి షెడ్యూల్‌ను మార్చి 20న అమలాపురంలో మొదలుపెడుతున్నాం. ఆ తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నై లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. రాజీవ్, దివిజ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్.
Comments
Please login to add a commentAdd a comment