కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన ప్రేమికుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నికోలయ్ సచ్దేవ్ను వరలక్ష్మీ ప్రేమించి వివాహం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని ఒక బీచ్ రిసార్ట్‌లో 2024 జులై 10న వారి వివాహం జరిగింది. దక్షిణ భారత సంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, వరలక్ష్మీ శరత్‌కుమార్ కుటుంబం నుంచి పెళ్లి తేదీ ఎప్పుడు అనేది గతంలో వారు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అందరూ వారి వివాహం జులై 2 అని భావించారు.
జులై 4న చెన్నైలోని తాజ్ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. దీంతో వారి వివాహం జులై 2న పూర్తి అయిందని అందరూ భావించారు. ఆ కార్యక్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. రజనీకాంత్, బాలకృష్, వెంకటేశ్, మంచు లక్ష్మి, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన వంటి స్టార్స్ ఆ రిసెప్షన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. పెళ్లితో సమానంగా ఆ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కానీ, వారి వివాహం జులై 10న థాయ్‌లాండ్‌లో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment