![Nicholai Sachdev Comments On Varalaxmi Sarathkumar](/styles/webp/s3/article_images/2024/07/15/Nicholai-Sachdev.jpg.webp?itok=DnOUnK7S)
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ముంబై గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌లు కొద్దిరోజుల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జూలై 10న థాయిలాండ్‌లోని క్రాబీ బీచ్ రిసార్ట్‌లో సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి ముగియడంతో ఈరోజు వీరిద్దరూ చెన్నైలో తమ నివాసంలో తొలిసారి మీడియాతో మాట్లాడారు.
వరలక్ష్మీ భర్త నికోలాయ్ ఇలా చెప్పుకొచ్చాడు. 'నేను కూడా తమిళం నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు తమిళంలో పొంతటి (భార్య) అనే పదం మాత్రమే తెలుసు. ఇకనుంచి నా ఇల్లు ముంబై కాదు.. చెన్నైనే నా ఇల్లు. నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నికోలాయ్ సచ్‌దేవ్. నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లయింది. అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకోవడం లేదు. నాకు కూడా ఆమె పేరు వరలక్ష్మి శరత్‌కుమార్‌గానే నచ్చింది.
![](/sites/default/files/inline-images/2_156.jpg)
కానీ, నేను మాత్రం ఆమె పేరును తీసుకుంటున్నాను. ఇకనుంచి నా పేరు 'నికోలాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్'గా మార్చుకుంటున్నాను. శరత్‌కుమార్, వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నా సొంతం. వరలక్ష్మి నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె ఫస్ట్ లవ్ మాత్రం నేను కాదు. ఆమె మొదటి ప్రేమ ఎప్పుడూ సినిమాల్లో నటించడమే. పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంటుంది. గతంలో మాదిరే మీ అందరి ప్రేమ,మద్దతు ఆమెకు అవసరం.' అని నికోలాయ్ అన్నారు.
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నికోలాయ్ చెప్పినట్లు అయన నా ప్రేమ అయితే.. సినిమా నా జీవితం. కాబట్టి పెళ్లి తర్వాత కూడా తప్పకుండా సినిమాల్లో నటిస్తాను. మాకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment