
వరలక్ష్మి శరత్‌కుమార్... టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిపోయింది. క్రాక్, నాంది, యశోద, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్.. ఇలా వరుసగా అన్నీ విజయాలే అందుకుంది. ఇటీవలే ఆమె ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం రిలీజైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియకు ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఆ క్వాలిటీ నచ్చింది
'నికోలయ్‌కు, నాకు మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టింది. అతడు నా వృత్తిని గౌరవిస్తాడు. సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎన్నడూ చెప్పలేదు. పైగా తను నన్ను చూసి గర్వపడతాడు. నాతో పాటు షూటింగ్‌కు వచ్చి ఖుషీ అవుతుంటాడు. నేను చేసే పనిని ఎంజాయ్ చేస్తాడు. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. నా జీవితాన్ని అతడితో పంచుకోవాలనిపించింది. ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాం.

అదే ఆయన చేసే పని
అతడు గ్యాలరిస్టు.. అంటే పెద్దపెద్ద కళాకారులు వేసే పెయింటింగ్స్‌ను కొనుక్కుంటూ అమ్ముతుంటాడు. అదే ఆయన చేసే పని! నా భర్తకు ఇదివరకే పెళ్లయిందని వార్తలు రాశారు. అది నిజమే! అయినా తనకు ఆల్‌రెడీ పెళ్లయితే తప్పేముంది? దీని గురించి మాట్లాడేవారికి ఒకటే చెప్తున్నా.. మీ పని మీరు చూసుకోండి.
డబ్బు కోసమే పెళ్లి?
అందరూ ఐశ్వర్యరాయ్, బ్రాడ్‌పిట్‌లేం కాదు. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి. మీరు ఏం అనుకుంటున్నారనేది నాకవసరమే లేదు. నా లైఫ్ నా ఇష్టం. డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటోందని కూడా అన్నారు. డబ్బు నా దగ్గర కూడా ఉంది. ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు నచ్చింది అనుకోండి.. డోంట్ కేర్' అని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పుకొచ్చింది.
చదవండి: రెండు సార్లు ప్రేమలో విఫలమైన హీరో.. ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే?
Comments
Please login to add a commentAdd a comment