చాలా విరామం తరువాత వస్తున్నా.. | hero tharun visit pb sidhartha college | Sakshi
Sakshi News home page

ఇది నా లవ్‌ స్టోరీ

Published Thu, Jan 25 2018 11:59 AM | Last Updated on Thu, Jan 25 2018 11:59 AM

hero tharun visit pb sidhartha college - Sakshi

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘నేను చాలా విరామం తరువాత మంచి కథతో తీసిన సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’ అని యువ కథానాయకుడు తరుణ్‌ అన్నారు. పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో బుధవారం సాయంత్రం ఆయన సందండి చేశాడు. ఇది నా లవ్‌ స్టోరీ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తరుణ్‌ విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో నటించిన ‘నువ్వే నువ్వే’ చిత్రం మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కామెడీ, డైలాగ్స్, ఎమోషన్స్‌ సన్నివేశాలు ఉంటాయని వివరించారు.

ఇప్పటికే  సినిమా పాటలు విడుదల అయ్యాయని, పాటలు విన్నారా అంటూ విద్యార్థులను అడిగారు. పాటల్లో ఏ పాట బాగా నచ్చిందో చెప్పాలంటూ అడగ్గా ఏ నిమిషంలో నిను చూశానో అనే పాట నచ్చిందంటూ విద్యార్థులు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా చూడదగిన మంచి ప్రేమ కథా చిత్రమని తరుణ్‌ అన్నారు. డైరెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో తరుణ్‌ను కొత్తగా చూస్తారని, సినిమాను చూసే సమయంలో ప్రతి విద్యార్థి తనను తాను ఈ సినిమాలో చూసుకుంటారని పేర్కొన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌‡ శ్రీనాథ్‌ విజయ్, కెమెరామెన్‌ కిస్టోఫర్, పీఆర్‌ఓ సతీష్‌ పాల్గొన్నారు. తరుణ్‌తో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement