pb siddhartha college
-
'మోడ్రన్' మహోత్సవం (ఫోటోలు)
-
చాలా విరామం తరువాత వస్తున్నా..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ‘నేను చాలా విరామం తరువాత మంచి కథతో తీసిన సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’ అని యువ కథానాయకుడు తరుణ్ అన్నారు. పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో బుధవారం సాయంత్రం ఆయన సందండి చేశాడు. ఇది నా లవ్ స్టోరీ చిత్రం ప్రమోషన్లో భాగంగా తరుణ్ విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో నటించిన ‘నువ్వే నువ్వే’ చిత్రం మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కామెడీ, డైలాగ్స్, ఎమోషన్స్ సన్నివేశాలు ఉంటాయని వివరించారు. ఇప్పటికే సినిమా పాటలు విడుదల అయ్యాయని, పాటలు విన్నారా అంటూ విద్యార్థులను అడిగారు. పాటల్లో ఏ పాట బాగా నచ్చిందో చెప్పాలంటూ అడగ్గా ఏ నిమిషంలో నిను చూశానో అనే పాట నచ్చిందంటూ విద్యార్థులు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా చూడదగిన మంచి ప్రేమ కథా చిత్రమని తరుణ్ అన్నారు. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తరుణ్‌ను కొత్తగా చూస్తారని, సినిమాను చూసే సమయంలో ప్రతి విద్యార్థి తనను తాను ఈ సినిమాలో చూసుకుంటారని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‡ శ్రీనాథ్ విజయ్, కెమెరామెన్ కిస్టోఫర్, పీఆర్ఓ సతీష్ పాల్గొన్నారు. తరుణ్‌తో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. -
ఆ డబ్బు సుజనా చౌదరిదేనా?
విజయవాడ: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ మొత్తంలో డబ్బు, మద్యం పట్టుబడుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలో పీబీ సిద్దార్థ కాలేజీలో 2.50 కోట్ల రూపాయల డబ్బు పట్టుబడింది. సిద్దార్థ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో తనిఖీలు నిర్వహించగా ఈ డబ్బు బయటపడింది. అయితే పట్టుబడ్డిన సొమ్ము రూ. 5 కోట్లు వరకు ఉంటుందంటున్నారు. కాలేజీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దాచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డబ్బు టీడీపీ నాయకులకు చెందినదిగా భావిస్తున్నారు. కాలేజీకి సమీపంలో ఉన్న ఓ హోటల్లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బస చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కోట్లాది రూపాయల డబ్బు పంపిణీ ఇప్పటికే జరిగిపోయిందంటున్నారు.