ఆ డబ్బు సుజనా చౌదరిదేనా?
విజయవాడ: సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ మొత్తంలో డబ్బు, మద్యం పట్టుబడుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలో పీబీ సిద్దార్థ కాలేజీలో 2.50 కోట్ల రూపాయల డబ్బు పట్టుబడింది. సిద్దార్థ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో తనిఖీలు నిర్వహించగా ఈ డబ్బు బయటపడింది. అయితే పట్టుబడ్డిన సొమ్ము రూ. 5 కోట్లు వరకు ఉంటుందంటున్నారు.
కాలేజీలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దాచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డబ్బు టీడీపీ నాయకులకు చెందినదిగా భావిస్తున్నారు. కాలేజీకి సమీపంలో ఉన్న ఓ హోటల్లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బస చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కోట్లాది రూపాయల డబ్బు పంపిణీ ఇప్పటికే జరిగిపోయిందంటున్నారు.