బిగ్‌బాస్‌-4 ఎంట్రీపై తరుణ్‌ క్లారిటీ | Hero Tharun Denies Bigg Boss Telugu Season 4 Entry | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌-4 ఎంట్రీపై తరుణ్‌ క్లారిటీ

Published Tue, Jul 21 2020 8:47 PM | Last Updated on Tue, Jul 21 2020 9:15 PM

Hero Tharun Denies Bigg Boss Telugu Season 4 Entry - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4లో పాల్గొనే కంటెస్టెంట్‌లకు సంబంధించి సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆ వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా హీరో తరుణ్‌ కూడా బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాను బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై తరుణ్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను బిగ్‌బాస్‌లో పాల్గొంటానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన కూడా లేదని తెలిపారు. ఫేక్‌ న్యూస్‌ నమ్మవద్దని.. అలాగే ప్రచారం కూడా చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (బిగ్‌బాస్‌-4పై ‘స్టార్‌ మా’ ప్రకటన)

‘అందరికీ నమస్కారం. ఈ కష్ట సమయంలో మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. సోషల్‌ మీడియాలో, కొన్ని న్యూస్‌ పేపర్లలో నేను బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలు. నేను ఆ షోలో పాల్గొనడం లేదు.. అలాగే పాల్గొనాలనే ఆసక్తి కూడా నాకు లేదు. ఇవన్నీ కేవలం రుమార్లు. దయచేసి ఫేక్‌ న్యూస్‌ నమ్మకండి.. అలాగే వ్యాప్తి చేయకండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మీ అందరి ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు’ అని తరుణ్‌ పేర్కొన్నారు. కాగా, గత ఏడాది కూడా తరుణ్‌ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.(తాత కాబోతున్న విలక్షణ హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement