ఖైదీ ఫంక్షన్ పవన్కు ఇష్టం లేదా..? | Pawan Kalyan is not going to attend Khaidi Pre Release Function | Sakshi
Sakshi News home page

ఖైదీ ఫంక్షన్ పవన్కు ఇష్టం లేదా..?

Published Fri, Jan 6 2017 12:33 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఖైదీ ఫంక్షన్ పవన్కు ఇష్టం లేదా..? - Sakshi

ఖైదీ ఫంక్షన్ పవన్కు ఇష్టం లేదా..?

మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150కి వీలైనంత హైప్ తీసుకువచ్చేందుకు మెగా ఫ్యామిలీ అంతా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా రాంచరణ్, అల్లు అరవింద్లు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ను సక్సెస్ చేసేందుకు కష్టపడుతున్నారు. మెగా హీరోలందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి మెగా కంబ్యాక్కు మరింత హైప్ తీసుకురావాలని భావిస్తున్నారు.

కొంత కాలంగా మెగా ఈవెంట్లకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ను ఈ వేడుకకు తీసుకు రావాలని మెగా క్యాంప్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పవన్ రారంటూ అల్లు అరవింద్ ప్రకటించినా.. రాంచరణ్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ అన్న నినాదాలు తప్పక వినిపిస్తాయని భావిస్తున్న మెగా టీం పవన్ వస్తేనే ఆ నినాదాలను అదుపు చేసే అవకాశం ఉంటుంది.

అయితే పవన్కు మాత్రం ఖైదీ ప్రీ రిలీజ్ వేడుక హజరయ్యే ఉద్దేశం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయిందని భావిస్తున్న పవన్ ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక అవసరం లేదని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. మెగా కాంపౌండ్ మాత్రం ఎలాగైనా పవన్ ఈ వేడుకకు హజరయ్యేలా చూడాలని ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement