ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2: ది రూల్' పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. సుమారు మూడేళ్ల తర్వాత వెండితెరపై తమ అభిమాన హీరోను ఫ్యాన్స్ చూడనున్నారు. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించారు. పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురుకానుంది.
తెలంగాణలో కష్టమే
హైదరాబాద్ సిటీలో నెలరోజుల పాటు పోలీసుల ఆంక్షలు ఉండనున్నాయి. ఈమేరకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగునున్నట్లు సమాచారం రావడంతో బీఎన్‌ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించారు. ఇది అమల్లో ఉన్నప్పుడు నలుగురికి మించి గుమిగూడటం, కలిసి తిరగడంపై నిషేధాజ్ఞలు ఉంటాయి.
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా హైదరాబాద్‌లో ఎలాంటి సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం కష్టమేనని చెప్పవచ్చు. నగరంలో వరుస ఆందోళనలతో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలోనే ఛాన్స్
పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించడం దాదాపు కష్టమేనని చెప్పవచ్చు. పోలీసులు ఆంక్షలు నవంబర్ 28 నాటికి పూర్తి అయినా కూడా వెంటనే ఒక భారీ ఈవెంట్ జరుపుకునేందుకు అనుమతులు రావడం కష్టమేనని చెప్పవచ్చు. దీంతో పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏపీలో జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అల్లు అర్జున్ మెగా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ జనసేన కార్యకర్తల నుంచి నాయకుల వరకు కొద్దిరోజుల క్రితమే డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే తమ నియోజకవర్గాల్లో పుష్ప చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటామని వారు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఒక వేదికపై పుష్ప చిత్రాన్ని తక్కువగా చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇలా పలు అడ్డుంకుల మధ్య పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏపీలో జరుగుతుందా..? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'దేవర' కూడా పలు ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రీ రిలీజ్ కార్యక్రమం లేకుండానే సినిమాను విడుదల చేశారు. ఆ తర్వాత చాలా బాధతో తన అభిమానుల కోసం ఎన్టీఆర్ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment