చినబాబు దర్శనం కోసం పడిగాపులు! | TDP leaders, workers waiting for Nara lokesh appointment | Sakshi
Sakshi News home page

చినబాబు దర్శనం కోసం పడిగాపులు!

Published Mon, Dec 15 2014 11:29 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

చినబాబు దర్శనం కోసం పడిగాపులు! - Sakshi

చినబాబు దర్శనం కోసం పడిగాపులు!

హైదరాబాద్ : చినబాబు.. నారా లోకేష్ దర్శనం కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పడిగాపులు గాస్తున్నారు.  పారిశ్రామికవేత్తలతో భేటికే పరిమితమవుతున్న ఆయన.. కార్యకర్తలు, పార్టీ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. దాంతో చినబాబు దర్శనం కోసం రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వారికి నెలకొంది.

కాగా గతంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి...15 రోజుల సమయం అడిగినా లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటీవలే తీగల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పౌర సరఫరాల శాఖమంత్రి సునీత ఫోన్ చేసినా లోకేష్ స్పందించనట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ శమంతకమణికి కూడా లోకేష్ దర్శనం కాకపోవటంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు. కాగా చినబాబు వైఖరిపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకే లోకేష్ అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలో ..పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement