Samantakamani
-
‘లౌక్యం’ తర్వాత ‘శమంతకమణి’
నిర్మాత వి.ఆనంద ప్రసాద్ ‘‘శమంతకమణి’ సినిమా మా భవ్య క్రియేషన్స్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. మా సంస్థలో ‘లౌక్యం’ చిత్రం తర్వాత 100 శాతం ప్రేక్షకులు బావుందని చెప్పిన సినిమా ‘శమంతకమణి’. కుటుంబమంతా కలిసి చూసే కథ. త్వరలో విజయయాత్ర చేయనున్నాం’’ అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్ అన్నారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన నా మిత్రులతో మరో సినిమా చేస్తా’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చేసిన కార్తీక్ క్యారెక్టర్ నాకు చాలా మెమరబుల్.’’ అన్నారు ఆది. ‘శమంతకమణి’ సినిమాకి వస్తున్న ప్రేక్షకుల ఆదరణ మా అందరి గెలుపుగా భావిస్తున్నాం’’ అని సందీప్ కిషన్ చెప్పారు. ‘‘ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. ఇలాంటి ఓ పాత్ర నాకు ఇచ్చినందుకు శ్రీరామ్ ఆదిత్యకు, ఇటువంటి చిత్రం తీసిన ఆనందప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నారా రోహిత్. ‘‘నా కల నిజం చేసిన మా హీరోలకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
చినబాబు దర్శనం కోసం పడిగాపులు!
హైదరాబాద్ : చినబాబు.. నారా లోకేష్ దర్శనం కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పడిగాపులు గాస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో భేటికే పరిమితమవుతున్న ఆయన.. కార్యకర్తలు, పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దాంతో చినబాబు దర్శనం కోసం రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వారికి నెలకొంది. కాగా గతంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి...15 రోజుల సమయం అడిగినా లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటీవలే తీగల టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పౌర సరఫరాల శాఖమంత్రి సునీత ఫోన్ చేసినా లోకేష్ స్పందించనట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ శమంతకమణికి కూడా లోకేష్ దర్శనం కాకపోవటంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు. కాగా చినబాబు వైఖరిపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకే లోకేష్ అపాయింట్మెంట్ దొరకని నేపథ్యంలో ..పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
టిడిపి ఎమ్మెల్సీ కుమారుడిపై కేసు నమోదు
అనంతపురం: సాక్షి ప్రతినిధులపై దాడికి సంబంధించి టిడిపి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం తయారు చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను చిత్రీకరించిన సాక్షి ఫొటోగ్రాఫర్, విలేకరిపై నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే.శింగనమల నియోజకవర్గం టీడీపీ నేతలు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమై ఏకపక్షంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. జాబితాల నుంచి వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల పేర్లను తొలగించారు. ఆ జాబితాను టీడీపీ వారితో నింపుతున్న విషయం బయటకు వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాక్షి ఫొటోగ్రాఫర్ జి. వీరేష్, విలేకరి సి. రమణారెడ్డి అక్కడకు వెళ్లారు. వారిని చూసి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షుడు ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డి, శింగనమల ఎంపీటీసీ చిదంబరంలు వారి అనుచరులతో మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని అసభ్య పదజాలంతో దూషి స్తూ, కొట్టుకుంటూ ఫంక్షన్ హాల్ కింది గదిలో ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి వద్దకు ఈడ్చుకెళ్లారు. ఈలోపు కొందరు ఫొటోగ్రాఫర్ వద్ద ఉన్న కెమెరా లాక్కున్నారు. అందులోని చిత్రాలను తొలగించి కెమెరాను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ నుంచి సాక్షి ప్రతినిధులను ఈడ్చుకుంటూ వెళ్లి గేటు బయటకు నెట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి అశోక్పైన, మరో ముగ్గురిపైన పోలీసులు 143,323,506,302 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డి, శింగనమల ఎంపీటీసీ సభ్యుడు చిదంబరంలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శుభకుమార్ తెలిపారు ఇదిలా ఉండగా, సాక్షి ప్రతినిధులపై టిడిపి నేతల దాడికి నిరసనగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. **