రాక్షసుడిలా 'రాయన్‌'.. అంచనాలు పెంచేసిన ట్రైలర్‌ | Dhanush Raayan Official Trailer Out Now, Watch Inside Video Goes Viral | Sakshi
Sakshi News home page

ధనుష్‌ 'రాయన్‌' ట్రైలర్‌ విడుదల

Published Tue, Jul 16 2024 6:30 PM | Last Updated on Tue, Jul 16 2024 6:54 PM

Dhanush Raayan Official Trailer Out Now

ధనుష్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'రాయన్‌' నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.  సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరాం, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'రాయన్‌' ట్రైలర్‌తోనే ధనుష్‌ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు రాయన్‌తో ఆయనలో దాగివున్న దర్శకత్వం టాలెంట్‌ అందరినీ మెప్పించేలా ఉంది. ట్రైలర్‌ను కూడా అందరినీ మెప్పించేలా కట్‌ చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జులై 26న రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement