
వెండితెరపై ‘జైలర్’ రాక ఏప్రిల్ నుంచి ఆగస్టుకు మారిందా? అంటే అవునంటోంది కోలీవుడ్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జైలర్’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోందనే వార్తలు వచ్చాయి.
తాజాగా ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ (ఏప్రిల్ 28 విడుదల) బాక్సాఫీస్ వసూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ‘జైలర్’ టీమ్ స్నేహపూర్వకంగా ఏప్రిల్ రిలీజ్‌ను వాయిదా వేసుకుందని కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment