Rajinikanth Jailer Movie: ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) ఆట మొదలెట్టారు. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. ఆయన అభిమానులకు మజానే. సూపర్‌స్టార్ రజనీకాంత్ కు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ మధ్య రజనీకాంత్ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఆయన స్టామినా తగ్గిందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్' సినిమా వ్యాపారపరంగా పెద్దగా ఊపు లేదనే మాట కూడా వినిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమన్నా, రమ్యకష్ణ, యోగిబాబు, వసంత రవి లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
(ఇదీ చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్!)
షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో రజనీకాంత్, ముత్తువేల్ పాండియన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఇందులో రజనీకాంత్ గెటప్, టైటిల్ లాంటివి రిలీజ్ చేసినా ఆశించిన మూమెంట్ రాలేదు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రచారం అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధం అయ్యింది.
ఇటీవల జైలర్ నుంచి 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఊపేస్తోంది. తమన్నా అందాలారబోత, అనిరుధ్ బీట్స్ దెబ్బకు పాట తెగ వైరల్ అయిపోయింది. ఈ వేడిలో హుకుమ్ టైగర్ కా హుకుమ్ అనే మరో మాస్ పాటను విడుదల చేయబోతున్నారు. జూలై 17న విడుదల చేయనున్నట్లు రజనీకాంత్ ఫొటోతో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సృష్టించే సంచలనం కోసం రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Oru chinna Preview-ku ready-ah? #HukumPreview Today at 6 PM 🙌🏼#Hukum #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @soupersubu pic.twitter.com/7OnUgA8WW8
— Sun Pictures (@sunpictures) July 15, 2023
(ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!)
Comments
Please login to add a commentAdd a comment