
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌తో తనకు దక్కిన అవకాశాన్ని దర్శకుడు నెల్సన్ తన్నుకుపోయారని దర్శకుడు వెంకట్‌ప్రభు పేర్కొన్నారు. సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ వారసుడు వెంకట్‌ప్రభు. 'చెన్నై 28' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఈయన తరువాత చెన్నై 28–2, మంగాత్తా, గోవా, మానాడు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. నటుడుగా, నిర్మాతగానూ కొనసాగుతున్న వెంకట్‌ప్రభు తాజాగా విజయ్ కథానాయకుడిగా గోట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
కాగా ఇటీవల ఈయన ఓ భేటీలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. తాను రజనీకాంత్ కథానాయకుడిగా చిత్రం చేయాలని ఆశించాననీ, అందుకు కథను కూడా సిద్ధం చేసి ఆయనకు వినిపించానని చెప్పారు. రజనీకాంత్‌కు కూడా కథ నచ్చిందన్నారు. దీంతో రజనీకాంత్‌తో చిత్రం చేయడం ఖాయం అయ్యిందన్నారు. అయితే చివరి క్షణంలో రజనీకాంత్‌తో చిత్రం చేసే అవకాశాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తన్నుకుపోయారని, అలా తనకు రజనీకాంత్‌తో చిత్రం చేసే అవకాశం మిస్ అయ్యిందని చెప్పారు.

నెల్సన్ దిలీప్‌కుమార్ నటుడు రజనీకాంత్‌తో చిత్రం చేయడం సంతోషమేననే అభిప్రాయాన్ని వెంకట్‌ప్రభు వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా గోట్ చిత్రం తరువాత ఈయన నటుడు శివకార్తికేయన్ హీరోగా ఓ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో జైలర్ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది.
Comments
Please login to add a commentAdd a comment