
రజనీకాంత్, అనిరుద్
తమిళసినిమా: యువ సంగీత దర్శకుడు అనిరుద్ శుభాకాంక్షల వరదలో మునిగి తేలుతున్నారు. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అనిరుద్ కొత్తగా ఏం చేస్తున్నారు? లాంటి ప్రశ్నలు తలెత్తడం సహజమే. 3 చిత్రంలోని వై దిస్ కొలై వెరి డీ పాటలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్న అనిరుద్‌కు లైఫ్ ఇచ్చిన నటుడు ధనుష్ పక్కన పెట్టారనే ప్రచారం ఒక పక్క జరుగుతుంటే ఈ యువ సంగీత దర్శకుడికి అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు కదా, భారీ చిత్రాల అవకాశాలు వరిస్తుండడం విశేషం.
ఇటీవల అజిత్ చిత్రాలకు వరుసగా పని చేసిన అనిరుద్‌ను తాజాగా సూపర్‌స్టార్ చిత్రానికి బాణీలు కట్టే అవకాశం వరించింది. నిజమే కాలా, 2.ఓ చిత్రాలు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న తరుణంలో కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటిం చడానికి పచ్చజెండా ఊపేసిన విషయం తెలిసిందే.
సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించను న్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతదర్శకుడిగా ఎంపికయ్యారు. దీంతో ఈ యువ సంగీత దర్శకుడికి పరిశ్రమ వర్గాల నుంచి శుభాకాంక్షల పరంపర మొదలైంది. యువనటుడు శివకార్తికేయన్, నిర్మాత ఆర్‌డీ.రాజా, నటుడు ఆర్య, వివేక్, సినీ ప్రముఖులు అనిరుద్‌కు సూపర్‌స్టార్ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం రావడంతో శుభాకాంక్షలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment