అఫీషియల్‌ : రజనీ మూవీలో విజయ్‌ | Vijay Sethupathi Offcially Confirmed for Rajinikanth Movie | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 26 2018 11:51 AM | Last Updated on Thu, Apr 26 2018 11:51 AM

Vijay Sethupathi Offcially Confirmed for Rajinikanth Movie - Sakshi

విజయ్‌ సేతుపతి-రజనీకాంత్‌

సాక్షి, చెన్నై ; క్రేజీ కాంబోలో ఎట్టకేలకు మూవీ ఖరారైంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రంలో టాలెంటెడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి నటించటం ఖాయమైపోయింది. గత కొంతకాలంగా విజయ్‌ ఈ ప్రాజెక్టులో నటించబోతున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ అధికారికంగా ప్రకటించింది.

పిజ్జా, జిగరతాండ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మ్యూజిక్‌ అనిరుధ్‌ అందిస్తుండగా.. ఇప్పుడు విజయ్‌ నటించబోయే వార్తను అనౌన్స్‌ చేసేశారు. వరుస హిట్లతో జోరు మీదున్న విజయ్‌కు ఇది మంచి అవకాశమే.  కాలా, రోబో తర్వాత రజనీ నటించబోతున్న చిత్రం కావటం, పైగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ లాంటి టాలెంటెడ్‌ దర్శకుడు కావటంతో తలైవా ఫ్యాన్స్‌లో అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి చిరంజీవి సైరాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement