
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా రిలీజ్‌కు రెడీ అవుతుండగా, రజనీ తరువాత చేయబోయే సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.
ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్రలో నటించేందుకు అంగీకరించాడు. రజనీ సరసన హీరోయిన్‌గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్‌ను ఫైనల్ చేసినట్టుగా వార‍్తలు వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరాడు. కోలీవుడ్‌లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న బాబీ సింహా, రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. కాలా రిలీజ్, ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత రజనీ కొత్త సినిమా షూటింగ్‌కు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment