
రజనీకాంత్
సరికొత్త ట్యూన్స్‌తో తమిళ ఇండస్ట్రీని డ్యాన్స్ చేయిస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్. సినిమాలోని పాటలను తనదైన మేనరిజమ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లే హీరో రజనీకాంత్. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పేట్టా’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 9న విడుదల కానుంది. డిసెంబర్ 3న ఫస్ట్ సాంగ్, 7న రెండో సాంగ్, 9న మొత్తం ఆల్బమ్‌ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ‘‘పేట్టా ఆల్బమ్‌తో తలైవరిజమ్ చూపిస్తాం. సిద్ధంగా ఉండండి’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేక చెన్నెలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కోలీవుడ్‌లో ఓ వార్త షికారు చేసింది. అయితే రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.