‘పేట్ట’ తెలుగు రిలీజ్‌ ఎప్పుడు? | Rajinikanth Petta Telugu Release Date | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 2:19 PM | Last Updated on Wed, Dec 19 2018 2:19 PM

Rajinikanth Petta Telugu Release Date - Sakshi

ఇటీవల 2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ షార్ట్‌ గ్యాప్‌లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 2.ఓ ఆలస్యంగా రిలీజ్‌ కావటంతో కేవలవం రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు రజనీ. యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన పేట్ట సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్‌ కానుంది.

అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్‌పై మాత్రం అనుమానాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్నా ఇంతవరకు తెలుగు వర్షన్ ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం ప్రారంభించలేదు. దీంతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ పేట్ట రిలీజ్‌ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్‌ ను సొంతం చేసుకున్నారు.

తెలుగులో యన్‌.టి.ఆర్‌, వినయ విధేయ రామ, ఎఫ్‌ 2 సినిమాలు సంక్రాంతి బరిలో పోటి పడుతున్నాయి. దీంతో పేట్ట టీం టాలీవుడ్‌లో రిలీజ్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రజనీ సరసన త్రిష, సిమ్రాన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బాబీ సింహాలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement