ఇప్పుడు కో–స్టార్‌గా... | Director Mahendran now part of Rajinikanth's petta film | Sakshi

ఇప్పుడు కో–స్టార్‌గా...

Oct 12 2018 1:58 AM | Updated on Sep 12 2019 10:40 AM

Director Mahendran now part of Rajinikanth's petta film - Sakshi

మహేంద్రన్, రజనీకాంత్‌

రజనీకాంత్‌ ‘పేట్టా’లోని తారాగణం రోజు రోజుకీ భారీగా మారుతోంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖీ, విజయ్‌ సేతుపతి, బాబీ సింహాలు ఎంటరయ్యారు. తాజాగా ఈ టీమ్‌లోకి తమిళ దర్శకుడు మహేంద్రన్‌ కూడా జాయిన్‌ అయ్యారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పేట్టా’.

రజనీకాంత్‌తో ‘ముల్లుమ్‌ మలరుమ్, జానీ’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్‌ ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నారు. పదేళ్లుగా సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్న మహేంద్రన్‌ విజయ్‌ ‘తేరీ’తో నటుడిగా ఇండస్ట్రీకు కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. అంతకుముందు ఆయన దర్శకుడిగా మాత్రమే చేసేవారు. కమ్‌బ్యాక్‌లో ఒకప్పుడు తాను సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం మహేంద్రన్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌. ప్రస్త్రుతం వారణాసీలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement